Wednesday, March 27, 2013

నేనే ఆశక్తి

తెలియని భయం వెంటాడుతుందని
ప్రతిక్షణం పురుగైయది తొలిచేస్తుందని
అడుగేస్తున్న బొటనవేలుని నరికినట్లు
మువ్వలు సడిచేయకుండా చిదిమినట్లు
జీవితమే జవాబులేని ప్రశ్నగా మారినట్లు
నీవు ఆలోచించావా ఇలా జరుగుతుందని?

ఈ భయానికి కారణం నీకెరుకనా?
నీ వ్యసనాలకి నే బలికావలసిందేనా
మనసుని మార్చి కఠినత్వం నేర్పించి
నీదాన్నైన నన్ను వేరెవరో అనుభవించి
వ్యభిచారిగా మారే పరిస్థితులు కల్పించి
అర్ధంతరంగా ముగిసే బ్రతుకిదని తెలుసునా?

తెలిసిన భయం నిలకడగా ఉండనీయకుంది
వద్దనుకున్న భవిష్యత్తు శూలమై పొడుస్తుంది
తాగుడికి బానిసవి నీవైతే శిక్ష నాకెందుకో చెప్పు
నీవు త్రాగే మద్యంలో కరగాలా నా నుదుటి బొట్టు
తెగింపు తెచ్చిన ధైర్యమో లేక చివరిప్రయత్నమో!!
అందుకున్నా త్రాగుడిని నరికే ఆత్మవిశ్వాసపు కత్తి
తెగనరుకుతా నీలోని వ్యసనాసురుడుని....నేనే ఆశక్తి.

Monday, March 18, 2013

నాకు బెంగ

http://www.youtube.com/watch?v=zRMCiJOLAwc
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి రెండేళ్ళుగా నన్నల్లుకుపోయిన నా రెమ్మ నా కూతురు రమ్య మళ్ళీ ఉద్యోగరీత్యా దూరమౌతుంటే.....ఆనాడు తనకు మెయిల్ చేసిన పాట ఇది....మళ్ళీ ఇప్పుడు ఇలా మీతో పంచుకుంటున్నాను!

Friday, March 1, 2013

పోరాటం

నీకు కావలసిన ఆయుధాలని నీవే సిధ్ధం చేసుకో
జీవితరణంలో ఒంటరిగా పోరాడాలని తెలుసుకో
ఆడపిల్లవై పుట్టగానే నీ ఇంట పుట్టిన నిశ్శబ్దాన్ని
కొడుకును కోరుతూ నీ తండ్రి చేసే హత్యాకాండని
కట్నం కావాలి అంటూ కాల్చే నరరూప రాక్షసుల్ని
అమ్మకు పుట్టి ఆలిని కొడుకు కోసం వేధించేవాడిని
కాసులకై నిన్ను పలుమార్లు అమ్మే కామాంధుల్ని
వృత్తి, విద్యలకాడ వెకిలివేషాలు వేసే వెర్రివెధవలని
నీవు ఛండీ అవతారమెత్తి వీరిని చీల్చి చెండాడు...
సబలవైన నీకు సీతాసహనం అస్సలు పనికిరాదు!