Thursday, April 19, 2018

!!వేషం మార్చి!!

నిర్వేదాన్ని నిర్విఘ్నంగా స్వాగతిస్తూ
నిస్సార నిర్లక్ష్య జీవితానుభూతిని 
పరమపద సోపానంగా పరుస్తూ
అంతర్మధనంతో అంతరాత్మని చంపి 
ఆలోచనల్లో ఆత్మానందానికి దూరమై 
వద్దంటూనే వాదించి వేదన కోరుకుని 
బంధాలకు అందకుండా జరిగిపోతూ 
బాధ్యతలేలని అనుబంధమే వద్దని
గిరి గీసుకుని ఒంటరిగా బ్రతికేస్తూ
గల్లంతైన గుండె కోసం వెతుకుతూ
ముఖం పై ముడతలకి ఆతిధ్యమిచ్చి 
చిరునామా లేని చితిని పేర్చుకుని 
గమ్యంలేని పయనమై సాగిపోతాను!!

3 comments:

  1. వామ్మో ఈ రేంజిలో తవికలు పుచ్చుకొని మాడు పగిలేలా కొడుతున్నారు. తవికలు అంటే జుగుప్స. లేదు ఈ జబ్బుకి చికిత్స

    ReplyDelete
  2. ఎటు చూసినా వ్యధలేనా???

    ReplyDelete