Wednesday, September 19, 2012

Sunday, September 16, 2012

విజయానికై....

ఆఫీస్ లో  ఏపని మొదలెట్టినా నా ఫ్రెండ్స్ అంతా అలా రిస్క్ తీసుకుని చేయడమెందుకు నలుగురితోపాటు మనం కూడా గుంపులో గోవిందం అంతేకానీ ఇలా ఓవర్ గా వర్క్ చేసి నీవు సాధించే  మెడల్స్ ఏమున్నాయంటున్నారు, లైఫ్ బోర్ గా రొటీన్ గా ఉంది ఏదైనా గొప్ప సక్సెస్ సాధించాలంటే ఏంచేయాలని అడిగిన మా అమ్మాయికి చెప్పిన విషయం మీతో పంచుకుంటూ......
ఒక అనాధాశ్రమంలోని పిల్లలకు ఆటల పోటీల్లో రొటీన్ కి భిన్నంగా ఒక క్రొత్తరకమైన పోటీని పెట్టారు అందులో వివిధ రకాలైన  కూరగాయల్ని పండ్లని ఒకే ఆకారంలో కట్ చేసి వారి కళ్ళకిగంతలు కట్టి, చుట్టూ మిగిలిన పిల్లల కేరింతల మధ్య కనుగొనమని చెప్పారు. అయిదు నిముషాల వ్యవధిలో ఎవరెక్కువగా కనుక్కుంటే వారే విజేతలు. పోటీ మొదలు పెట్టగానే పిల్లలందరూ వారికి తోచిన విధంగా అరుస్తూ అది ఇదని, ఇది అదనీ అరుస్తుంటే పాల్గొన్నవారు కంగారులో చాలా తప్పులు చెప్పారు. కానీ ఒక చిన్నారి మాత్రం ప్రతి ముక్కని రుచి చూసి వాసనతో పసిగట్టి అత్యధిక కూరగాయల, పండ్ల పేర్లను చెప్పి ప్రధమ బహుమతిని కైవసం చేసుకుంది. ఆ చిన్నారిని చూస్తే ముద్దేసి నీ పేరేంటని అడిగితే పక్కనున్న ఇంకో అమ్మాయి  మేడం! ఈ అమ్మాయికి ఆక్సిడెంట్ అయి వినపడంలేదు అందుకనే మేము ఏం చెప్పినా వినకుండా తన సొంత ఆలోచనతో, తెలివితో ప్రైజ్ కొట్టేసిందని అమాయకంగా చెప్పి నా కళ్ళు తెరిపించింది.
ఇది మా అమ్మాయికి అర్థమై ఉంటే త్వరలో ఒక మంచి సక్సెస్ న్యూస్ తో మీ ముందుంటాను.

Sunday, September 2, 2012

నమ్మకం

జ్ఞానం, ధనం, శక్తి, శ్రమ మరియు నమ్మకం అందరూ మంచిమిత్రులు.....
కలిసి ఆనందంగా ఉందామనుకున్నారు కానీ కాలం కలసిరాక విడిపోవలసి వచ్చింది....
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉండాలో అని చర్చించుకుంటూ.....
జ్ఞానం:- నేను విద్యాలయాల్లో, మందిరాల్లో, మసీదు, చర్చి, గురుద్వార్ లాంటి చోట్ల తలదాచుకుని నా దరిచేరిన వారికి నేను తగిన విధంగా దక్కుతానంది.
ధనం:- నేను మహల్లో, ఆస్తిపరుల ఖజానాల్లో దాకుంటానని చెప్పింది.
శక్తి:-ఆరోగ్యం మరియు సమతుల్యమైన ఆహారాన్ని నేను ఆశ్రయిస్తానన్నది.
శ్రమ:- సోమరితనంవీడి పట్టుదలతో సాధించాలని అనుకునే వారి దగ్గర వారాలు గడిపేస్తూ బ్రతుకుతానన్నది.
నమ్మకం మాత్రం మౌనంగా శూన్యంలోకి చూస్తుంటే జ్ఞానం మరియు ధనం అదేం నీవు ఎక్కడికి వెళతావో చెప్పవేం అనడిగిన దానికి ఒక ధీర్ఘశ్వాస తీసుకుని నిదానంగా ఇలా అన్నది........ "నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇంక తిరిగిరాను".