Europe trip...16th-26th July 2016 (All Indian Medical Association) విమానం మిలన్(Milan) ఎయిర్ పోర్ట్ లో దిగింది మొదలు అల్పాహారం అన్ని హోటల్స్లో అతిగా ఆరగించామనే చెప్పాలి. ఇటలీ(Italy) వినైస్(Venice) ద్వీపంలో విహారయాత్రకి ముందు విందుభోజనం మొదలుకుని పదిరోజులు సుష్టిగా టైంకి భోజనానికి ఏమాత్రం లోటు జరుగలేదు అని చెప్పడానికి పెరిగిన మా బరువులే నిదర్శనం. చెప్పడం మరిచానండి...వినైస్ లో బోటు షికారు బాగుంది. ఫ్లోరెన్స్(Florence) నుండి బయలుదేరి రోం(Rome) నగర రోడ్లపై వాటికన్(Vatican) సిటీ అందాలను గాంచి పిసా(Pisa) టవర్ పైకి ఎక్కకనే పై మెరుగులు చూసి పయనించాము. బ్లాక్ ఫారెస్ట్, జర్మనీ(Germany)లో సుధీర్ఘ ప్రయాణం తరువాత టిట్లిస్(Titlis) మంచుపర్వత అందాలతో మనసు ఘనీభవించింది. స్విజర్లాండ్(Switzerland)లో మూడురోజులు ఉన్నా ఇంకా ఉండాలనిపించే ప్రకృతి అందాలు దానికే సొంతం. అయినా తప్పని పయనం కదా...డిజాన్(Dijon) వీధులగుండా పారిస్(Paris)కి పయనం. ఫ్రాన్స్(France) పాష్ హోటల్ నోవాటెల్ లో మకాం. రెండురోజులు పారిస్ నగర అందాలు, ఈఫెల్(Eiffel) టవర్ ఎక్కిన ఆనందాలని మూట గట్టుకుని బెల్జియం(Belgium)కి పయనం. బ్రుసెల్స్(Brussels)లో కట్టడాలు చూసిన పిమ్మట నెదర్లాండ్స్(Netherlands) ఆంస్టెర్డాం(Amsterdam)కు చేరుకుని మరునాడు మడురొడం(Madurodam) పార్క్ చూసి ఫాంక్ఫర్ట్(Frankfurt) ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కి హైదరాబాద్(Hyderabad) చేరుకోవడంతో యూరప్(Europe) టూర్ ముగిసింది.