Friday, August 10, 2012

పెదచేప-చినచేప

జఫాన్ వాళ్ళకి తాజా చేపలంటే చాలా ఇష్టం.
కానీ వారికి దగ్గరలో నీటివనరులు లేకపోవడంతో చేపలుపట్టి ఐస్ లో నిలువ చేసుకునేవారంట. కానీ దానివల్ల చేపల్లో తాజాదనం నశించి అవి తక్కువ ధరకి అమ్ముడుపోయి వ్యాపారస్తులకి నష్టం వాటిల్లుతున్నదని పెద్ద ట్యాంకుల్లో చేపల్ని పట్టి వాటిని అందులో పెంచసాగారు. అయినా అవి కొన్నిరోజులకే నిస్సత్తువగా మారి అక్కడక్కడే తిరుగుతూ ముందు ఉన్న రుచి తగ్గిందని గమనించి ఆ పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఆ చేపలతో పాటు ఒక షార్క్ చేపని కూడా వేయడంతో చేపలన్నీ ప్రాణభయంతో ట్యాంకతా కలియ తిరుగుతూ చలాకీగా ఉండేసరికి జఫాన్ వాసులకి తాజా రుచికరమైన చేపల్ని ఆరగించే అవకాశం వారిసొంతమైంది.
గమనించారా.....
మనంకూడా కొన్నిసార్లు అలా నిస్సత్తువతో, నిస్తేజంగా జీవిస్తుంటాం. అలాకాకుండా జీవితంలోని ఒడిదుడుకులకు నిరాశపడక సవాలు అనే షార్క్ చేపల్ని మన మైండ్ అనే ట్యాంకులోకి వదిలితే మనం కూడా చాకచక్యంతో నైపుణ్యంగా కష్టాలని ఎదిరించి ముందుకుసాగిపోతాం.
ముందుకు సాగిపోయి ఏం లాభం ఎవరికో ఒకరికి ఆ చేపల్లా బలికావలసిందేకదా అని అనుకునేవారికి....ఎప్పుడో ఒకప్పుడు అంతమైయ్యేదే కదా అలా కనీసం పరులకోసం పనికొచ్చేలా (రుచికరమైన ఆహారంలా) పోతే పరమార్థం కదా అంటాను.
మీరు ఏమనితిట్టుకున్నాసరే!!!

Thursday, August 2, 2012

రక్షించేబంధమా?

హాయ్ ఫ్రెండ్స్! "రక్షాబంధనం" అంటే రక్షణ కోరుతూ ఒక బంధాన్ని ఇరువ్యక్తుల మధ్య సృష్టించుకోవడం అని ఒక ప్రముఖవ్యక్తి చెప్పగా విని నాలో కలిగిన భావాలని మీతో పంచుకోవాలని నా ఈ చిన్ని ప్రయత్నం.
ఒకవేళ పైన చెప్పినట్లు ఇరువ్యక్తుల నడుమ ఆ బంధమే రక్షించేదైతే అది అన్నాచెల్లెళ్ళ మధ్యనే ఎందుకో అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, మేనకోడలుమామలు, బావామరదళ్ళు ఇలా ఒకరికొకరు ఎవరు రక్షిస్తారు అనుకుంటే వాళ్ళకే ఈ "రాఖీ" కట్టొచ్చుకదా!
పోనీ లింగ భేధముంటేనే రక్షిస్తారు అది కూడా మగవారు ఆడవారినే కాపాడతారు అనుకుంటే ఆఫీసులో ఉన్న బాస్ కి రాఖీ కడతామంటే చాలామంది బాస్ లు ఎందుకు వద్దంటారో! 
నా ఈ మట్టిబుర్రకి తోచిన చెత్త ఆలోచనలని తోసిపారేయకుండా, ఆలోచించి బదులిస్తారని ఆశిస్తూ...
ఏమైనా ఒక బంధం రక్షిస్తుంది అనుకుంటే ఆ బంధానికి నేను బద్ధురాలిని....అందుకే అందరికీ "రక్షాబంధనం" శుభాకాంక్షలు తెలియజేస్తున్నా!!!


Sunday, July 29, 2012

మట్టిబెడ్డలు

సంధ్యా సమయంలో ఒకవ్యక్తి అలా సముద్రపు ఒడ్డున నడుస్తూ కుప్పగా పడి దారికడ్డుగా ఉన్న పెద్ద పెద్ద మట్టిబెడ్డల్ని చూసి వాటిని తీసి ఒకోటి సముద్రంలోకి విసిరేస్తూ చివరికి నాలుగు మిగిలి ఉండగా....యాధాలాపంగా ఒక మట్టిబెడ్డని పగులగొట్టి చూసి ఆశ్చర్యంతో చకితుడైనాడు అందులో మెరుస్తున్న వజ్రాన్ని చూసి. మిగిలిన నాలుగూ పగులగొట్టి చూడగా అందులో కూడా వజ్రాలే మెరుస్తూ కనపడి ఇతడ్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించి....
అయ్యో అనవసరంగా మట్టిబెడ్డలు అనుకుని పైపైన చూసి అనవసరంగా వజ్రాలని సముద్రపాలు చేసాను కదా అని పశ్చాతాపడ్డాడు....


మనం కూడా అలాగే పైపై ఆకారాన్ని చూసి ఎందుకూ పనికిరారనుకుని నిర్లక్ష్యం చేస్తుంటాం వజ్రాలాంటి కొంతమంది వ్యక్తుల్ని. అలా కాకుండా చూసిన వెంటనే ఎవరిపైనా ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి రాకుండా వారితో సాన్నిత్యంగా మెలిగి వారిలోని మంచిని గ్రహిస్తే వజ్రాలెన్నో మన చేయిజారిపోకుండా మనతోనే ఉండి మన విలువను మరింత పెంచుతాయేమో యోచిద్దాం.....ఏమంటారు!

Sunday, June 24, 2012

3 ప్రశ్నలు???

మా ఆఫీస్ లో నా సహ ఉద్యోగిని లంచ్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటూ ఆత్రుతతో భోజనం కూడా చేయనీయకుండా వినమంటూ వివరించబోతుంటే......
ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
1.ప్ర:-నీవు చెప్పాలనుకుంటున్నది నిజమా, అది నీవు చూసావా?
 జ:- "లేదు"విన్నాను చెప్పుకుంటుంటే...
మరి అలాంటప్పుడు నీవు చెప్పేది నిజము అవునో కాదో, నీవు కన్నులతో చూడలేదు నీవు చెప్పబోయే విషయం గురించి నీకే సరిగ్గా తెలీదు దాని గురించి మనకెందుకు!
2.ప్ర:- నీవు చెప్పబోతున్న విషం మంచిదా?
జ:-"లేదు"
మంచి విషయం ఐతే పదిమందికి చెప్పు, లేకపోతే దానిగురించి మరచిపో!
3.ప్ర:-నీవు చెప్పడం వలన మనిద్దరిలో ఎవరికైనా ఉపయోగము ఉందా?
జ:-అలాంటిది ఏమీ లేదు.
నీవు చెప్పాలనుకుంటున్న విషయంలో నిజంలేదు, మంచిలేదు, ఉపయోగం అంతకన్నాలేదు.
అలాంటప్పుడు అది నాకు చెప్పవలసిన అవసరం కూడాలేదు.

ఫ్రెండ్స్....ఏదైనా విషయం చెప్పేముందు ఈ మూడు ప్రశ్నలు మనకి మనం వేసుకుని ముందుకు సాగుదాం...
Wishing  you GOOD LUCK!

Sunday, June 17, 2012

కేక్ కిక్...

అమ్మా...ఎందుకని ఇలా అన్నీ నాకే జరుగుతున్నాయి, నేనేం తప్పుచేసాను, మొన్న లెక్కల్లో ఫెయిల్ అయ్యాను, నిన్న నా అనుకున్న స్నేహితుడు నన్ను వదిలేసాడు, ఏది అనుకున్నా నాకే ఎందుకని ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది? ఇలా ప్రశ్నలవర్షం కురిపిస్తున్న కూతుర్ని కేక్ తయారుచేస్తున్న తల్లి చూసి నీకు ఇష్టమైన కేక్ చేస్తున్నాను ఇది నీవు తిన్నాక నీ ప్రశ్నలకి సమాధానం వెదుకుదాం అన్న మాటలకి సరె అని..."నీవు చేసే కేక్ అంటే నాకు అమితమైన ఇష్టం".
అమ్మ: కాస్త డాల్డాని అందివ్వు..
కూతురు: ఛా ఇదేంటో ఇంత జిడ్డుగా ఉంది!
అమ్మ: ఆ 4 కోడిగుడ్లని కూడా పగులగొట్టి అందులో వేయి, అలాగే ఆ మైదాపిండిని కూడా, అదే చేత్తో చిటికెడు సోడా తీసుకుని కలుపు..
కూతురు: యాక్ :( ఇదేంటమ్మా ఈ గుడ్లు ఇంత వాసన వస్తున్నాయి, ఈ పిండి ఇలా రబ్బర్ లా సాగుతుంది....చూస్తుంటేనే అసహ్యంగా ఉన్నాయి!
అమ్మ: అవును అవి అన్నీ అలా విడివిడిగా అలాగే ఉంటాయి, కానీ వాటినన్నింటినీ సమపాళ్ళలో కలిపి సక్రమంగా ఉడకనిస్తే....నీకు ఇష్టమైన రుచికరమైన కేక్ తయారౌతుంది.

అలాగే మన పనులు కూడా......ఇష్టమైన విధంగా జరగాలంటే  విసుగు, చిరాకు లేకుండా మనకి జరుగుతున్న విషయాలని కష్టం అనుకోకుండా సక్రమంగా ఆలోచించి ఆచరణలో పెట్టి శ్రమపడితే తగిన సమయానికి మనం ఆశించిన ఫలితాలు మనకి దక్కుతాయి. అవే మనం జీవితంలో ముందుకు సాగడానికి కిక్కునిస్తాయి :)