Monday, September 9, 2019

Padmarani-The Unique

అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలి.. ఎలా?

Sunday, August 11, 2019

!!వాక్ వాక్!!

వాక్ వాక్...నడక ఉత్తమ వ్యాయామం
వాదోపవాదాలు కోపోధ్రేకానికి దారి తీస్తాయి
అందుకే వాట్ని కాలితో తన్ని నడచివెళ్ళిపో!

ఉద్దేశపూర్వకంగా అణచివేసే వ్యక్తులుంటారు
వారిని త్రోసి నీదారిలో నువ్వు నడచివెళ్ళిపో!

ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ఆలోచనలే ఆటంకాలు
వాటి మొదళ్ళు త్రుంచి వేగంగా నడచివెళ్ళిపో!

నిన్ను లెక్కచేయని అవకాశవాదులు ఎందరో 
కన్నెత్తైనా చూడక నీ గమ్యంవైపు నడచివెళ్ళిపో!  

వైఫల్యాల్ని గుర్తుచేసి ఆందోళన రేపేవే భయాలు
అడ్డంగా నరికేసి అనుభవపాఠంతో నడచివెళ్ళిపో!
   
జీవితం ఆనందంగా ఆరోగ్యంతో గెంతులువేసేను 
విషంలా ప్రాకే విషయాలను నలిపి నడచివెళ్ళిపో!

వాక్ వాక్...నడక ఎంతో ఉత్తమ వ్యాయామం 
ప్రేమ దయ శాంతి మరియు మంచితనం వైపు
ఆలోచించక వేగంగా అడుగులువేసి నీవు సాగిపో! 

Thursday, July 11, 2019

నా జీవిత అల


నా జీవిత సాగరపు అలలు
కొన్ని మిమ్ము తాకాలని చేసిన
చిన్ని వీడియో ప్రయత్నం...

Thursday, July 4, 2019

!!మరోమారు జీవిస్తాను!!

పదవీ విరమణ తరువాత జ్ఞాపకాల్లో బ్రతుకుతూ కాలాన్ని మళ్ళీ తిరగేస్తూ కొన్ని అనుభూతులని ఒకటికి రెండుసార్లు తలుచుకోవాలి అనుకుంటాను పసిపిల్లలా మారి పరుగులు తీయాలనుకుంటాను నాగరిక నడకలో నన్నునేను పరిగెత్తించాలని కాదు నా పరుగు చూసి అమ్మ నవ్వి మురిసిపోవాలని! పాఠశాలకు యూనిఫారంలో మరోమారు వెళతాను చదువులన్నీ చదివి ఏదో వెలగబెట్టేయాలని కాదు స్కూల్ ఫ్రెండ్సుని పలుకరించి అల్లరి చేసెయ్యాలని! కొత్తగా జాబ్లో చేరి కొలీగ్స్ ని కలవాలనుకుంటాను పని తక్కువ కబుర్లెక్కువా చెప్పుకోవచ్చని కాదు మొదటి నెల జీతం తీసుకున్న ఆనందంపొందాలని! మరోసారి పెళ్ళిచేసుకుంటే బాగుంటుందనుకుంటాను కంగారు పడకండి భాగస్వామిని మార్చాలని కాదు పెళ్ళి సంబరాలు మరింత ఘనంగా చేసుకోవాలని! పెళ్ళైన నా పాప మళ్ళీ పసిపిల్లైపోవాలనుకుంటాను తొందరగా ఎదిగి పెళ్ళితో దూరమైపోయిందని కాదు మరింత సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని! బ్రతకడానికి మరికొంత సమయం కావాలనుకుంటాను జీవితంలో సంపాధించి ఇంకేదో ఉద్దరించేద్దామని కాదు ఇతరులకు నేనేదో విధంగా కొంతైనా సహాయపడాలని! ఎన్ననుకుని ఏం లాభం..? గడిచిన కాలం తిరిగిరాదు అందుకే ఈ క్షణం మనదనుకుని సంపూర్ణంగా జీవిద్దాం!