నన్నునే ప్రేమించుకుని లోకాన్ని చూడబోతే
లోకంలో ధ్వేషించడానికి మనిషే కరువైనాడు
బాధలని లెక్కచేయక వదిలి నవ్వుతూ తిరిగితే
సంతోషాలే చంకలెగరేసి వచ్చి చుట్టుకునె చూడు
ఓటమిని ఒగ్గేయక కొత్తమార్గంలో పయనించబోతే
పనికిరాని ప్రయత్నమని నవ్వి గేలి చేసె నాడు
నన్ను నేనే నమ్ముకుని పలుమార్లు ప్రయత్నిస్తే
విజయమే వెతుక్కుంటూ వచ్చి చేరు ఒకనాడు
నా లక్ష్యం మంచిదని తెలుసుకుని నేను నడిస్తే
ఎత్తునున్న నన్ను చూడ జనం తలెత్తెదరు ఆనాడు!
Nice inspiration lines.
ReplyDeleteనన్నునే ప్రేమించుకుని లోకాన్ని చూడబోతే
ReplyDeleteలోకంలో ధ్వేషించడానికి మనిషే కరువైనాడు..simple sootram.
సన్మార్గానికి దారి చూపారు.
ReplyDelete