Sunday, July 19, 2020

!!ఎవ్వరూ రారు!!


తలుపులు బార్లా తీసి ఉంచినా లోపలికి ఎవ్వరూ రారు
వెన్నెల విరబూసున్నా జాబిలిని ఎవ్వరూ పలుకరించరు
ఇప్పుడు పూలవాసన్ని ఆకులూ ముళ్ళే పీలుస్తున్నాయి
పక్షుల కుహకుహలు కూడా రోదనలుగా వినిపిస్తున్నాయి
ఈ నమ్మశక్యం కాని నిజమైనా చూడ్డానికి ఎవ్వరూలేరు!

కష్టాల్లో హితులు పలుకరించడానికి రావాలనున్నా రాలేరు
కడుపున పుట్టిన వారిని అయినా సరే ముట్టుకోవద్దంటారు     
భ్రమరాలు సైతం పువ్వులలో తేనె ఝుర్ర ఆలోచిస్తున్నాయి
సీతాకోకచిలుకల రెక్కలు కూడా ఎగురలేక అతుక్కున్నాయి
ఈ విపత్కర పరిస్థితుల్లో నాలుగ్గోడలే స్వర్గం అంటున్నారు!

ఒంటరిగా అరచి గోలచేసినా వినడానిక్కూడా ఎవ్వరూ లేరు   
కరోనా సోకిన రోగి శవంపై దుప్పటి కూడా ఎవ్వరు కప్పరు
అందుకే గుంపుగా ఉండొద్దు దూరాన్ని పాటిద్దాం అంటున్నది
అత్యవసరం అనుకుంటే తప్ప ఇంటిపట్టునే ఉండమంటున్నది
ఈ మహమ్మారికి ఇంతకు మించిన పరిష్కారము లేకున్నది!

3 comments:

  1. Very nice post on Covid madam
    Be safe

    ReplyDelete
  2. Nice presentation madam. Doctors are the worst hit, after rendering selfless service. We have to save you doctors. Please take care and be safe while treating

    ReplyDelete
  3. ఈ కోవిడ్ కాష్ట కాలమందు మిక్కిలి మనిషి మస్తిష్కం ఆలోచనలతో కాస్త, ఆవేదన తో కాస్త, ఉద్విగ్నతతో కాస్త అల్లాడుతు తల్లాడుతు.. తనను తాను రక్షించుకుంటు..

    ఔను..

    వైద్యులు అందుట్లో పల్మనాలజిస్ట్ లకు తీరిక, ఓపిక, సహనశీలత కాస్త ఎక్కువ గానే ఉండాలి.. ఐనాగాని తమ సేవ తాత్పర్యతతో అడుగడుగున హెచ్చరిస్తు, వైద్యాన్ని అందిస్తు..
    వైద్యు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది జనాలలో కలిగిన ఇబ్బందిని రూపుమాపేందుకు శాయాశక్తుల పోరాడుతూనే ఉన్నారు ఈ శార్వరి అలియాస్ కోవిడ్ నామ ఉగాది నాటి నుండి నేటి వరకు..

    ~శ్రీత ధరణీ భూక్య

    ReplyDelete