మనకు లభించిన దానితో తృప్తిపడి ఆనందాన్ని పొందగలగడమే నిజమైన భోగం మరియు అదే పరిపూర్ణమైన ఆనందం. భోగి పండగ ద్వారా చాటబడే నీతి అదే. చెప్పడం వ్రాయడం సులభమే...ఆచరణ కష్టమే! అయినా ప్రయత్నిద్దాము... మనకు లేనిది, మనది కానిది, నిన్నటి చేదును, మనలోని దురాశలను భోగి మంటల్లో వేసి, రాబోయే కాలానికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ... భోగి-మకర సంక్రాంతి-కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు!