దిల్ ఖుష్ నేను ఫుల్ హ్యాపీస్
ఏ బంధాలు బాధ్యతలు నాకులేవు
ఎవ్వరికీ ఏం చెయ్యాల్సింది లేదు
కష్టమో నష్టమో నాకునేను భరించి
నన్ను నేను ప్రేమించుకుంటే చాలు
ఎవ్వరినీ ఇబ్బందిపెట్టే పనిఉండదు!
వేరెవరికో నేను చేయడం ఏమిటి
ఎవరినీ అంటిముట్టి రాసుకోనుగా
ఏ రోగమూ రొచ్చూ నాదరి చేరదు!
ఒంటరితనం అంటే నాకెంతో ఇష్టం
వండి పెట్టక ఉన్నదేదో తింటేచాలు
ఎవరికోసం ఏ త్యాగం చేయక్కర్లేదు!
నాకు నేనే ప్రశ్నను జవాబు కూడా
ఎన్నో బాధలు అందులో సంతోషం
ఇదే ఇదే నేను కోరుకున్న జీవితం!