
ఓ! భగవంతుడా నన్ను నీవు ఒక టెలివిజన్ గా మార్చేయి, నేను మా ఇంట్లో ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నాను.అలా నేను మా కుటుంబ సభ్యుల అందరినీ నా చుట్టూ కూర్చోపెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించాలని నా ఆశ. టీవీ పనిచేయకపోతే దాని మీద చూపించే శ్రధ్ధని నా పై చూపాలని నా కోరిక. నాన్నగారు బయటి నుండి రాగానే టీ తాగుతూ రిలాక్స్ అవ్వడానికి, అమ్మ మూడ్ బాగోపోతే విసిగించకు నన్ను అంటూ మనసుని ఉల్లాస పరచుకోవడానికి, అన్నయ్యలు ఇది అది అని నాకోసం పొట్లాడుకోవడానికి నాపై ఆధారపడతారు, అంటే ఇంట్లోని అందరి దృష్టి నాపై(టీవీ) ఉంటుందిగా. అలా అందరూ నాతో సమయాన్ని గడుపుతూ వాళ్ళు ఆనందాన్ని పొందుతారు కదా!
అందుకే నిన్ను నేను ఇలా కోరుకుంటున్నాను. భగవంతుడా! నన్ను టెలివిజన్ గా మార్చి నాకోరిక తీరుస్తావు కదా!
అది చదివిన టీచర్ గారి భర్త కాగితాన్ని భార్యకు ఇస్తూ... భగవంతుడా!ఎంత ధారుణం ఆ తల్లిదండ్రులది, పాపం ఆ పసిపాప అనుకుంటూ....
అది మన కూతురు వ్రాసినదేనండి అంటూ అతని వైపు చూసింది!