పరీక్షల్లో పిల్లల్ని వ్యాసరచనల్లో భగవంతుడ్ని మీరు ఎవరిలా మార్చమని కోరుకుంటారు అన్న దానికి సమాధానంగా ఒక చిన్నారి వ్రాసిన సమాధానాన్ని చదివిన టీచర్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది చూసి వాళ్ళాయన ఏమైంది అని అడిగిన దానికి సమాధానంగా ఆ కాగితాన్ని ఇచ్చి చదవమంది....
ఓ! భగవంతుడా నన్ను నీవు ఒక టెలివిజన్ గా మార్చేయి, నేను మా ఇంట్లో ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నాను.అలా నేను మా కుటుంబ సభ్యుల అందరినీ నా చుట్టూ కూర్చోపెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించాలని నా ఆశ. టీవీ పనిచేయకపోతే దాని మీద చూపించే శ్రధ్ధని నా పై చూపాలని నా కోరిక. నాన్నగారు బయటి నుండి రాగానే టీ తాగుతూ రిలాక్స్ అవ్వడానికి, అమ్మ మూడ్ బాగోపోతే విసిగించకు నన్ను అంటూ మనసుని ఉల్లాస పరచుకోవడానికి, అన్నయ్యలు ఇది అది అని నాకోసం పొట్లాడుకోవడానికి నాపై ఆధారపడతారు, అంటే ఇంట్లోని అందరి దృష్టి నాపై(టీవీ) ఉంటుందిగా. అలా అందరూ నాతో సమయాన్ని గడుపుతూ వాళ్ళు ఆనందాన్ని పొందుతారు కదా!
అందుకే నిన్ను నేను ఇలా కోరుకుంటున్నాను. భగవంతుడా! నన్ను టెలివిజన్ గా మార్చి నాకోరిక తీరుస్తావు కదా!
అది చదివిన టీచర్ గారి భర్త కాగితాన్ని భార్యకు ఇస్తూ... భగవంతుడా!ఎంత ధారుణం ఆ తల్లిదండ్రులది, పాపం ఆ పసిపాప అనుకుంటూ....
అది మన కూతురు వ్రాసినదేనండి అంటూ అతని వైపు చూసింది!
ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఇలాగే వున్నాయి. మంచి టపా.
ReplyDeleteబాగుందండీ. ఇవాళ్టి పరిస్తితులను ప్రతిబింబిస్తూ
ReplyDeleteచిన్నారి అమాయకంగా అడిగినా ఘాటుగా అడిగింది.....మంచి పొస్ట్!
ReplyDeleteకొసమెరుపు బాగుంది. అంతే, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అని. ప్రతిఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఇది. చక్కగా చెప్పారు.
ReplyDeleteఇంకా మనస్సాక్షి మాట వినే వారున్నారాండీ..? చాలా బాగా నచ్చింది నాకు ఆ టీచర్ ఆత్మ విమర్శ. చక్కటి కంటెంట్ రాసినందుకు మీరూ నచ్చారండీ.
ReplyDeleteప్రేరణ... గారూ...,
ReplyDeleteనమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
బాగుందండీ..మనం చేస్తున్న తప్పును సూటిగా చెప్పారు..మీనుండి మరిన్ని టపాలు కోరుకుంటు...కంగ్రాట్స్..
ReplyDelete