Wednesday, October 24, 2012

Saturday, October 6, 2012

నీవెలా?

ఏంటో ఈ జీవితంలో ఏది సాధించాలన్నా కష్టతరంగా మారిపోయిందంటూ వంటింట్లో సహాయం చేస్తూ నా కూతురంది. కూరగాయలుకోస్తూ నేను మూడుగిన్నెల్లో నీళ్ళుపోసి ఒక గిన్నెలో క్యారెట్, రెండవగిన్నెలో కోడిగుడ్డు, మూడవదాంట్లో కొన్ని కాఫీగింజల్ని వేసి మరిగించమన్నాను. ఒకటిది, రెండవది పర్వాలేదు కానీ కాఫీగింజల్ని కూడా మరిగించమన్నది అంటే ఏదో మత్లబుందని మనసులో అనుకుని పైకి మాట్లాడకుండా పావుగంట తరువాత వాటిని వేర్వేరు గిన్నెల్లోకి మార్చి వీటి మర్మమేమిటో చెప్పు మాతాజీ అన్నట్లు నావైపు చూసింది....
1.ముందు గట్టిగా ఉండి వేడి తగలగానే తన అస్తిత్వాన్ని కోల్పోయి మెత్తగామారి పనికి రాకుండా పోయిన క్యారట్,
2.పైనపెంకు లోపల ఏదో సాధించాలన్న జిజ్ఞాసలాంటి సొనని కొంతకాలం కాపాడినా వేడి అనే ఒడిదుడుకులని తట్టుకోలేక పై డొప్ప పగిలి లోపల గట్టిపడిన గుడ్డు,
3.మరిగిన నీటిలాంటి క్లిష్ట పరిస్థితుల్లో  కూడా చెక్కు చెదరక నీటికి తన రంగుని, రుచిని మరియు గుణాన్ని ఇచ్చిన కాఫీగింజలు......
మూడూ సమానంగా ఒకే రకమైన విధి ప్రతికూల పరిస్థితులవంటి నీటిలో మరిగినా దేనికదే వేరువేరుగా పరివర్తనం చెందాయి.....
మరి నీవు ఎలా మారాలి అనుకుంటున్నావో చెప్పు?
క్యారట్?
కోడిగుడ్డు?
కాఫీగింజ?