Saturday, October 6, 2012

నీవెలా?

ఏంటో ఈ జీవితంలో ఏది సాధించాలన్నా కష్టతరంగా మారిపోయిందంటూ వంటింట్లో సహాయం చేస్తూ నా కూతురంది. కూరగాయలుకోస్తూ నేను మూడుగిన్నెల్లో నీళ్ళుపోసి ఒక గిన్నెలో క్యారెట్, రెండవగిన్నెలో కోడిగుడ్డు, మూడవదాంట్లో కొన్ని కాఫీగింజల్ని వేసి మరిగించమన్నాను. ఒకటిది, రెండవది పర్వాలేదు కానీ కాఫీగింజల్ని కూడా మరిగించమన్నది అంటే ఏదో మత్లబుందని మనసులో అనుకుని పైకి మాట్లాడకుండా పావుగంట తరువాత వాటిని వేర్వేరు గిన్నెల్లోకి మార్చి వీటి మర్మమేమిటో చెప్పు మాతాజీ అన్నట్లు నావైపు చూసింది....
1.ముందు గట్టిగా ఉండి వేడి తగలగానే తన అస్తిత్వాన్ని కోల్పోయి మెత్తగామారి పనికి రాకుండా పోయిన క్యారట్,
2.పైనపెంకు లోపల ఏదో సాధించాలన్న జిజ్ఞాసలాంటి సొనని కొంతకాలం కాపాడినా వేడి అనే ఒడిదుడుకులని తట్టుకోలేక పై డొప్ప పగిలి లోపల గట్టిపడిన గుడ్డు,
3.మరిగిన నీటిలాంటి క్లిష్ట పరిస్థితుల్లో  కూడా చెక్కు చెదరక నీటికి తన రంగుని, రుచిని మరియు గుణాన్ని ఇచ్చిన కాఫీగింజలు......
మూడూ సమానంగా ఒకే రకమైన విధి ప్రతికూల పరిస్థితులవంటి నీటిలో మరిగినా దేనికదే వేరువేరుగా పరివర్తనం చెందాయి.....
మరి నీవు ఎలా మారాలి అనుకుంటున్నావో చెప్పు?
క్యారట్?
కోడిగుడ్డు?
కాఫీగింజ?

26 comments:

  1. నేనైతే కాఫీ గింజకు వోటు వేస్తానండీ...
    వేడిగా తాగుదామని..:-) Good Post..

    ReplyDelete
  2. ఎప్పటిలాగే...పిల్లలకు చెప్తున్నట్లు...
    చక్కగా చెప్పారు... బాగుంది పద్మరాణి గారు!...
    @శ్రీ

    ReplyDelete
  3. వంటిల్లంటే వండుకుని తినడానికే కాదు ఒక విజ్ఞానాలయమని మీ ద్వారా చక్కగా తెలుస్తుంది!

    ReplyDelete
  4. Ur daughter is so lucky mam.
    nice post for everyone.

    ReplyDelete
  5. పద్మ రాణి గారు చాల అద్భుతంగా చెప్పారు really ur daughter is so lucky

    ReplyDelete
  6. Vantillu koodaa g.k book... baap re paaripotaanu

    ReplyDelete
  7. ఏం చెప్పినా అందులోని సారం చక్కగా పాటించాలి అనిపిస్తుందండి.

    ReplyDelete
  8. Padma gaaru.....naku manchi tips dhorukuthaay aythe mee dhaggara....Practicals tho cheppesaru...Bagundhi :)

    ReplyDelete
  9. గుర్తుంచుకోవాల్సిన అంశం...చాలా బాగా చెప్పరు.

    ReplyDelete
    Replies
    1. గుర్తుంచుకునేదిగా గుర్తించినందుకు ధన్యవాదాలండి.

      Delete
  10. చక్కటి పోస్ట్...విజ్ఞాన వికాస 'ప్రేరణ'మయం! అభినందనలండి.

    ReplyDelete
  11. మీరు చెప్పే తీరు పిల్లలకేకాదు పెద్దలకీ మంచి మార్గమే. వ్రాస్తూ ఉండండి.

    ReplyDelete
    Replies
    1. తప్పక....మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      Delete