Sunday, February 12, 2017

!!ప్రోద్భలం!!

ఆత్మఘోష రెపరెపలాడుతూ పైకెగురుతుంటే 
శాంతి సంకెళ్ళ కోసం వెతికే మనసు అలిసిపోతే
ఊరడించడానికైనా ఒక్కసారి ఆ ఘోష వినరాదా
ఓదార్పు కోసమైనా అశాంతిలో శాంతి చూపరాదా
సలహా సంప్రదింపులతో ఓటమికి గెలుపు నొసగి 
ఆత్మస్థైర్యానికి సరిహద్దులేదని చాటి చెప్పరాదా!

అవకాశాలతో అల్లుకున్న గొంగళిపురుగులుంటే
కాలానికి అణుకువను ఆయుధంగా అందించి 
రంగురంగుల సీతాకోకచిలుకలుగా మార్చేయరాదా
ఒద్దికలేని మిడిసిపాడు జయంకి ప్రతిబంధకం కదా
నిరంతర కృషికి ఓర్పుని శక్తి ఔషధంగా నూరిపోసి
బ్రతుకు బంధీ కాకుండా ప్రోద్భలాన్ని చేకూర్చరాదా!

2 comments:

  1. ప్రోత్సాహంతో ముందుకు నడిపించే కవిత.

    ReplyDelete
  2. మీరు ప్రేరణ వాక్యాలతో రెచ్చగొడుతున్నారు మాడం :)

    ReplyDelete