Sunday, May 19, 2019
Friday, May 10, 2019
!!విచిత్రరోగం!!
అన్నింటినీ ఎదిరించి ఆసరాగా నిలబడి
నేనున్నాను నీకని ధైర్యాన్ని ఇచ్చేవారే
అసలైన ఆత్మీయులని ఎప్పటికప్పుడు
అనుకుంటూ నమ్మేస్తుంటాను అందరినీ!
ఏ బంధంలేని అనామకుల్ని నా అనుకుని
నిస్వార్థ అభిమానంతో అక్కున చేర్చుకుని
నాకు తోచిన/మించిన సహాయమే చేస్తాను
తెలిసి తప్పుచేసి దూరమౌతాను అందరికీ!
అనుకూలమై అవకాశం కుదిరితే ముడిపడి
అవసరానికి పలికితే తెలుసుకోలేని నా ఈ స్థితి
మనసున్న వారికొచ్చే రోగమని తెలిసి కూడా
నయంకాని చివరిదశ కామోసు రోగం పరిస్థితి
రోగం ఏదైనా రాకుండా చూసుకోవాలని చెప్పి
మానసికరోగానికి నవ్వడమే మందు అందరికీ!
Saturday, May 4, 2019
!!ముఖం మారింది!!
అద్దంలో చూసుకుంటే నా ముఖమే మారింది
చూస్తూ చూస్తుండగానే ఎన్నో మారిపోయాయి
నా ఆశల మేఘం కురవకుండా నేలనితాకింది
అద్దంపై కాస్త ఎండపడగానే రూపం మార్చింది
అందుకే నేనద్దం చూడగా నా ముఖం మారింది!
గందరగోళ ప్రశ్నల మధ్య జీవితానందం నలిగింది
దీపం ఆరిపోతుంది అనగా వెలుగు ప్రకాశించింది
కంటికి రాకరాక కునుకువస్తే కలే మారిపోయింది
చూస్తూ చూస్తుండగానే ఎన్నెన్నో జరిగిపోయాయి
అందుకే నేనద్దం చూసుకుంటే ముఖం మారింది!
కలల్ని ఖైదుచేసినా అన్నింటా ఓటమే మిగిలింది
సమయం మారువేషంలో వచ్చి నన్నే మార్చింది
గమ్యం దగ్గరౌతుంటే దారి మొత్తం మారిపోయింది
నిన్నటి గుర్తులూ నేటి ఛాయలూ ఏం మిగల్లేదు
అందుకే నేను అనుకున్న నా రూపమే మారింది!
Subscribe to:
Posts (Atom)