Saturday, May 4, 2019

!!ముఖం మారింది!!

అద్దంలో చూసుకుంటే నా ముఖమే మారింది
చూస్తూ చూస్తుండగానే ఎన్నో మారిపోయాయి
నా ఆశల మేఘం కురవకుండా నేలనితాకింది
అద్దంపై కాస్త ఎండపడగానే రూపం మార్చింది
అందుకే నేనద్దం చూడగా నా ముఖం మారింది!   

గందరగోళ ప్రశ్నల మధ్య జీవితానందం నలిగింది
దీపం ఆరిపోతుంది అనగా వెలుగు ప్రకాశించింది
కంటికి రాకరాక కునుకువస్తే కలే మారిపోయింది
చూస్తూ చూస్తుండగానే ఎన్నెన్నో జరిగిపోయాయి
అందుకే నేనద్దం చూసుకుంటే ముఖం మారింది!

కలల్ని ఖైదుచేసినా అన్నింటా ఓటమే మిగిలింది
సమయం మారువేషంలో వచ్చి నన్నే మార్చింది
గమ్యం దగ్గరౌతుంటే దారి మొత్తం మారిపోయింది  
నిన్నటి గుర్తులూ నేటి ఛాయలూ ఏం మిగల్లేదు
అందుకే నేను అనుకున్న నా రూపమే మారింది!

1 comment:

  1. జీవితాన్ని పరిపూర్ణంగా చదివిన సారం..

    ReplyDelete