Wednesday, June 5, 2019

!!తరాంతరం!!

మనుషుల్ని వంచిన విచిత్ర విజ్ఞానమా నీకు వందనం..
ఇంతకీ అజ్ఞానం ఆ తరానిదో ఈ తరానిదో తెలుపుమా!!

బావిలో నీరు త్రాగి హాయిగా బలాదూర్ గా బ్రతికేవాళ్ళని
ఫిల్టర్ నీరు త్రాగి 50ఏళ్ళకు వృద్ధులయ్యేలా వరమిచ్చావు

గానుగాడించి నూనె త్రాగి తిన్నవారిని నిగనిగలాడేలా చేసి
ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తో 40ఏళ్ళకే గుండెను నొప్పించావు

రాళ్ళఉప్పును సేవించి కూడా రాయిలా గట్టిగా బ్రతికేవాళ్ళం
అయోడిన్ ఉప్పుతిని హై బీ.పి అని హైరానా పడుతున్నాం

ఆరేడు మందిని కని ఆరోగ్యంగా అన్ని పనులూ చేసే వాళ్ళు
ఒక్కర్ని కనడానికే ఆపసోపాలు పడి ఆపరేషన్ అంటున్నారు

బెల్లంతో పిండి వంటల్ని పీకలదాకా మెక్కి ఆనందించే మాకు
ఏమీ తినకముందే షుగర్ అని చెప్పి కడుపుకాల్చేస్తున్నారు

నాడిపట్టి రోగం చెప్పి రెండు మాత్రలిచ్చిన నాటి ప్రాణదాతలైన
వైద్యులు స్కానింగ్లు టెస్ట్లని కూడా రోగమేంటో చెప్పలేకున్నారు!

3 comments:

  1. జివిత అనుభూతులు అక్షర నిజాలు

    ReplyDelete
  2. అనుభవాల పాఠాలు నేర్పుతున్నారు

    ReplyDelete
  3. అప్పటి తరం మిన్న నేటి తరం కన్నా

    ReplyDelete