వాక్ వాక్...నడక ఉత్తమ వ్యాయామం
వాదోపవాదాలు కోపోధ్రేకానికి దారి తీస్తాయి
అందుకే వాట్ని కాలితో తన్ని నడచివెళ్ళిపో!
ఉద్దేశపూర్వకంగా అణచివేసే వ్యక్తులుంటారు
వారిని త్రోసి నీదారిలో నువ్వు నడచివెళ్ళిపో!
ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ఆలోచనలే ఆటంకాలు
వాటి మొదళ్ళు త్రుంచి వేగంగా నడచివెళ్ళిపో!
నిన్ను లెక్కచేయని అవకాశవాదులు ఎందరో
కన్నెత్తైనా చూడక నీ గమ్యంవైపు నడచివెళ్ళిపో!
వైఫల్యాల్ని గుర్తుచేసి ఆందోళన రేపేవే భయాలు
అడ్డంగా నరికేసి అనుభవపాఠంతో నడచివెళ్ళిపో!
జీవితం ఆనందంగా ఆరోగ్యంతో గెంతులువేసేను
విషంలా ప్రాకే విషయాలను నలిపి నడచివెళ్ళిపో!
వాక్ వాక్...నడక ఎంతో ఉత్తమ వ్యాయామం
ప్రేమ దయ శాంతి మరియు మంచితనం వైపు
ఆలోచించక వేగంగా అడుగులువేసి నీవు సాగిపో!
Nice message
ReplyDeleteఆత్మస్థైర్యాన్ని తగ్గించే ఆలోచనలే ఆటంకాలు...కొన్ని పనుల వలన కలిగే ఆటంకాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. గతంలో కాని పనులు ... ఆత్మస్థైర్యం కాపాడుతుంది.
ReplyDelete