పైకి నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటా కానీ..
లోలోపల నేను ఆత్మగౌరవపోరాటం చేస్తుంటాను!
కపటంలేకుండా దాచక ఉన్నది చెప్పేస్తా కానీ..
కరకుస్వరమే నాచుట్టూ కంచైందని తెలుపలేను!
అందరూ మెచ్చే చరిత్రను సృష్టించలేను కానీ..
ఎవ్వరూ చెయ్యెత్తి చూపి చెప్పే ఆస్కారమివ్వను!
మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నది చేస్తా కానీ..
తిరిగి ఆశించరాదంటూనే అనురాగాన్ని ఆశిస్తాను!
ఎల్లలెన్ని ఎగసిపడ్డా పిడికిలెత్తి ప్రోత్సహిస్తా కానీ..
ఫిరంగినై మాటల తూటాలు పేల్చి నొప్పించలేను!
బానిసత్వ బంధాలపై బంధూక్ పెట్టలేను కానీ..
భయపెట్టే అంటరాని ఆయుధంగా మిగిలిపోతాను!

evaru anaru bhayapedataru ani
ReplyDeletesupportive and well understanding/keep it up.
Me attitude meeku raksha.
ReplyDeleteనవ్వు ఆరోగ్యానికి అనందానికి కూడా ఎంతో అవసరం తల్లీ. నవ్వుతూ నవ్విస్తూ పదికాలాలు చల్లగా ఉండండి.
ReplyDelete