అయిదుగురు సర్జన్స్ చర్చించుకుంటున్నారు...
ఎటువంటి పేషంట్ అయితే ఆపరేషన్ కి అనువైన వాడని!
:):):):):) ?????
మొదటి డాక్టర్ అన్నారు నేనైతే అకౌంటంట్ అనువైన వాడు అనికుంటాను ఎందుకంటే అతని శరీరంలో ప్రతి భాగమూ నంబరింగ్ వేసివుంటుంది కదా!
రెండవ డాక్టర్...హేయ్ ఎలక్ట్రీషియన్ అయితే అతనిలోని భాగాలన్ని కలర్ కోడ్స్ తో ఆపరేషన్ కి అనువుగా వుంటాయి!
మూడవ డాక్టర్...నాకైతే లైబ్రేరియన్ పేషంట్ కి ఆపరేషన్ చేయడం సులువు ఎందుకంటే అతని శరీరంలో ఏభాగమైనా చక్కగా ఒక క్రమమైన పద్దతిలో లేబులింగ్ చేసి అమర్చబడి ఉంటాయి.
నాలగవ డాక్టర్...మీరు ఏమన్నా నాకు మాత్రం భవనాల కట్టడి( ) రంగంలో వున్నవారైతే హాయి ఏమో అనిపిస్తుంది , ఎందుకంటే వాళ్ళే అర్థం చేసుకోగలరు పని ఆఖరిలో చిన్న చిన్న పనులు వదిలేసి పూర్తి చేస్తాం అన్నా ధైర్యంగా వుండడం ఎలాగో!
అప్పటి వరకూ నోరు మెదపకుండా కూర్చున్న అయిదవ డాక్టర్ ఒక్క ఉదుటన లేచి పిచ్చివాళ్ళారా... రాజకీయ నాయకుడి కన్నా ఎవరూ అనువైన రోగి కాదు ఆపరేషన్ కి, ఎందుకంటే వాళ్లకి మాత్రమే హృదయం కాని,అనుకున్న పనిని చేసే ధైర్యం కాని, వెన్నెముక కాని,తల వున్నా అందులో మెదడుకాని,ఏవీ ఉండవు, ఏ భాగం లేని వానికి ఆపరేషన్ చేయడం ఎంత సులువో ఒక్కసారి ఆలోచించండి!
ఒక బ్లాగర్ ని ఆ'పరేషన్' చేస్తే ఎలా సులువో చెప్పారు కాదు!
ReplyDeleteబాగుంది మొత్తానికి. ఇలా డిసైడ్ చేస్తే చాలామందికే సర్జరీ జరక్కపోవచ్చు కదా:)
ReplyDelete