ఏవిటిది స్వామీ..... నేను నమ్మలేకపోతున్నాను, ఏవిటీ ఇవ్వన్నీ నాకేనా?
అమ్మో! ఇన్నినగలే....వడ్డాణం,అరవంకీ,కాసులపేరు,పాపిటబిల్ల,సూర్యుడు, చంద్రుడు,ముక్కుపుడక,నాగరం,జడకుప్పెలు,గాజులు,మురుగులు, బంగారుపట్టీలు,జుంకీలు,దుద్దులు,చెంపసరాలు,మాటీలు,ఉంగరాలు,చంద్రహారం,నెక్లెస్, లాకె ట్గొలుసు....
ఎన్నని చెప్పను కొన్నింటి పేర్లు కూడా నాకు తెలియడంలేదు, ఈ ఆనందం తట్టుకోలేక తెలిసిన వాటి పేర్లు కూడా తప్పు చెప్పేస్తున్నానేమో!
ఇవేకామోసు ఏడువారాల నగలు అంటే?
భగవంతుడా! చప్పడ్ ఫాడ్ కర్ దేనా అంటే ఇదేనా స్వామీ?తెలుగులో సామెతలు కూడా గుర్తురావడం లేదు అడ్జస్ట్ అయిపో స్వామీ....
ఇవ్వడమైతే ఇచ్చావు మరి ఎలా ధరించాలో వీటిని వివరించవేలయ్యా?
ఆదివారం సూర్యానుగ్రహానికి కెంపులు,
సోమవారం చంద్రుని చల్లదనానికి ముత్యాలు,
మంగళవారం కుజుని కొరకై పగడాలు,
బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలు,
గురువారం బృహస్పతి కొరకు కనక పుష్యరాగాలు,
శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు,
శనివారం శని శాంతికై నీలమణి పతకాలు....
వేసుకోమని సెలవిచ్చారు సంతోషం స్వామీ!
కానీ మీకు మా పై ఇంత చిన్నచూపు ఏలనయ్యా?
వారానికి పదిరోజులు పెడితే మీ సొమ్మేం పోతుంది స్వామీ?
స్వామీ....చెప్పండి,
చెప్పండి స్వామీ?
స్వామీ...స్వామీ
చెప్పండి స్వామీ
కలలోనైనా
కనీసం జస్టిస్
చేయండి స్వామీ>:):)
ప్రేరణ వున్న విన్నపాలు చాలక ఇది ఒకటా పాపం దేవుడికి. వారానికి పది రోజులు. బాగుంది. ;-)
ReplyDeleteఇంతకీ ఎన్ని వారాల నగలు నొక్కేసారు:)(కలలో)
ReplyDeleteకొన్చెమ్ ఆ అమ్మాయి అద్రెస్స్ చెపుతార దయచెసి?
ReplyDelete