Tuesday, June 1, 2010

అందమైన హృదయం.

యువహృదయం డాబుగా దర్జాగా నిలబడి తనంత అందమైన వారే ఎవరూ లేరు అంటూ విర్రవీగింది. ఔనంటే ఔనంటూ దాని అందాన్ని మిగతా యువ హృదయాలు పొగడ సాగాయి.అంతలో అక్కడికి ఒక వృధ్ధహృదయం వచ్చి.........

ఏంటీ! నాకన్నా అందమైనదా నీ హృదయం అని ప్రశ్నించింది.

యువ హృదయాలన్నీ.....
ఆ ముక్కలై, సొట్టలుపడి, బీటలువారి, అక్కడక్కడా అతుకులు వేయబడి వున్న వృధ్ధహృదయాన్ని చూసి ఇదా! అందమైన హృదయమా! అని ఆశ్చర్యపోతూ బీటలువారిన నీవెక్కడ అత్యంత సౌందర్యవంతమైన మా యువ హృదయమెక్కడ అని అవహేళన చేసాయి.....

దానికి సమాధానంగా వృధ్ధహృదయం.... నీవు బాహ్యసౌందర్యాన్ని చూసి విర్రవీగు తున్నావు. నా హృదయం పైన బీటలు నేను పంచిన ప్రేమకి చిహ్నం, నా హృదయాన్ని కోసి ముక్కలుగా నా ప్రేమని పంచాను. దానికి బదులుగా వారు ఇచ్చిన ప్రేమను తీసుకుని నా హృదయంలోని ఖాళీలను పూడ్చాలని ప్రయత్నించాను.అలా ఏర్పడినవే ఈ అతుకులు, బీటలు.నేను పంచిన ప్రేమకి బదులుగా కొందరు తిరిగి ఇవ్వని వాటికి గుర్తులు ఈ ఖాళీలు.సరీ సరిపడని ప్రేమతో ఏర్పడిన ఈ ఖాళీలు, అతుకులు, బీటలు చూడడానికి అసహ్యముగావున్నా నాకు గర్వంగా కూడా వుంటుంది. ఎందుకంటే నేను ఇంతమందికి ప్రేమని పంచగలిగానుకదా అని. ఇప్పుడు చెప్పు ఎవరు అందమైనవారో????

యువహృదయం మౌనంగా కన్నీరు కారుస్తూ వెళ్ళి వృధ్ధహృదయాన్ని క్షమించమంటూ తన హృదయం నుండి కొంచెం ముక్కని తీసి ఇచ్చి ఖాళీగా ఉన్న వృధ్ధహృదయంలో అమర్చింది.అది సరిగ్గా అందులో సరిపడకపోయినా వృధ్ధహృదయం యువహృదయాన్ని కౌగిలించుకుని తన హృదయం నుండి చిన్నిముక్కను తీసి ఇచ్చింది.దాన్ని యువహృదయం అమర్చుకుని చిన్ని బీట ఉన్న తన హృదయం ఇప్పుడిప్పుడే అందాన్ని సంతరించుకుంటుందని వృధ్ధహృదయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తెగమురిసింది.....

11 comments:

  1. బావుంది చిన్ని కధ. హృదయానికి బీట్లు పడిన లెక్క తో అందాన్ని పోల్చటం. హుం... మంచి ఆలోచన.

    ReplyDelete
  2. బాగుందండి ! మరొకటి ఆశించవచ్చా ?

    ReplyDelete
  3. బాగుందండి.....చక్కగా చెప్పారు.

    ReplyDelete
  4. idi bagundi enta bagundi antee naa hrudayallo unna chemmani bayataki techetantaa ani chepputaanu...

    mee prerana chaalaa bagundi nestam... mee seshu...

    ReplyDelete
  5. ప్రేరణ గారూ , మీరు రాసిన పోస్ట్ చాలా బాగుంది, ఎంత బాగుందంటే అన్ని హ్రిదయాలనూ ఆలోచింపచేసేదిగా ఉంది. మీ బ్లాగ్ మొత్తం ఇంకా చూడలేదు. చూస్తాను,

    ReplyDelete
  6. మీ పోస్ట్ లోని భావం అద్భుతం.చాలా బాగా వ్రాసారు.ఇప్పటి యువతకు కనువిప్పు.

    ReplyDelete
  7. బాగుంది. ప్రేమలోనూ వయసుతో బాటు పెద్దరికం, అందరినీ ప్రేమించే గుణం వస్తాయని బాగా చెప్పారు.

    ReplyDelete