Sunday, June 24, 2012

3 ప్రశ్నలు???

మా ఆఫీస్ లో నా సహ ఉద్యోగిని లంచ్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటూ ఆత్రుతతో భోజనం కూడా చేయనీయకుండా వినమంటూ వివరించబోతుంటే......
ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
1.ప్ర:-నీవు చెప్పాలనుకుంటున్నది నిజమా, అది నీవు చూసావా?
 జ:- "లేదు"విన్నాను చెప్పుకుంటుంటే...
మరి అలాంటప్పుడు నీవు చెప్పేది నిజము అవునో కాదో, నీవు కన్నులతో చూడలేదు నీవు చెప్పబోయే విషయం గురించి నీకే సరిగ్గా తెలీదు దాని గురించి మనకెందుకు!
2.ప్ర:- నీవు చెప్పబోతున్న విషం మంచిదా?
జ:-"లేదు"
మంచి విషయం ఐతే పదిమందికి చెప్పు, లేకపోతే దానిగురించి మరచిపో!
3.ప్ర:-నీవు చెప్పడం వలన మనిద్దరిలో ఎవరికైనా ఉపయోగము ఉందా?
జ:-అలాంటిది ఏమీ లేదు.
నీవు చెప్పాలనుకుంటున్న విషయంలో నిజంలేదు, మంచిలేదు, ఉపయోగం అంతకన్నాలేదు.
అలాంటప్పుడు అది నాకు చెప్పవలసిన అవసరం కూడాలేదు.

ఫ్రెండ్స్....ఏదైనా విషయం చెప్పేముందు ఈ మూడు ప్రశ్నలు మనకి మనం వేసుకుని ముందుకు సాగుదాం...
Wishing  you GOOD LUCK!

Sunday, June 17, 2012

కేక్ కిక్...

అమ్మా...ఎందుకని ఇలా అన్నీ నాకే జరుగుతున్నాయి, నేనేం తప్పుచేసాను, మొన్న లెక్కల్లో ఫెయిల్ అయ్యాను, నిన్న నా అనుకున్న స్నేహితుడు నన్ను వదిలేసాడు, ఏది అనుకున్నా నాకే ఎందుకని ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది? ఇలా ప్రశ్నలవర్షం కురిపిస్తున్న కూతుర్ని కేక్ తయారుచేస్తున్న తల్లి చూసి నీకు ఇష్టమైన కేక్ చేస్తున్నాను ఇది నీవు తిన్నాక నీ ప్రశ్నలకి సమాధానం వెదుకుదాం అన్న మాటలకి సరె అని..."నీవు చేసే కేక్ అంటే నాకు అమితమైన ఇష్టం".
అమ్మ: కాస్త డాల్డాని అందివ్వు..
కూతురు: ఛా ఇదేంటో ఇంత జిడ్డుగా ఉంది!
అమ్మ: ఆ 4 కోడిగుడ్లని కూడా పగులగొట్టి అందులో వేయి, అలాగే ఆ మైదాపిండిని కూడా, అదే చేత్తో చిటికెడు సోడా తీసుకుని కలుపు..
కూతురు: యాక్ :( ఇదేంటమ్మా ఈ గుడ్లు ఇంత వాసన వస్తున్నాయి, ఈ పిండి ఇలా రబ్బర్ లా సాగుతుంది....చూస్తుంటేనే అసహ్యంగా ఉన్నాయి!
అమ్మ: అవును అవి అన్నీ అలా విడివిడిగా అలాగే ఉంటాయి, కానీ వాటినన్నింటినీ సమపాళ్ళలో కలిపి సక్రమంగా ఉడకనిస్తే....నీకు ఇష్టమైన రుచికరమైన కేక్ తయారౌతుంది.

అలాగే మన పనులు కూడా......ఇష్టమైన విధంగా జరగాలంటే  విసుగు, చిరాకు లేకుండా మనకి జరుగుతున్న విషయాలని కష్టం అనుకోకుండా సక్రమంగా ఆలోచించి ఆచరణలో పెట్టి శ్రమపడితే తగిన సమయానికి మనం ఆశించిన ఫలితాలు మనకి దక్కుతాయి. అవే మనం జీవితంలో ముందుకు సాగడానికి కిక్కునిస్తాయి :)