Sunday, June 17, 2012

కేక్ కిక్...

అమ్మా...ఎందుకని ఇలా అన్నీ నాకే జరుగుతున్నాయి, నేనేం తప్పుచేసాను, మొన్న లెక్కల్లో ఫెయిల్ అయ్యాను, నిన్న నా అనుకున్న స్నేహితుడు నన్ను వదిలేసాడు, ఏది అనుకున్నా నాకే ఎందుకని ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది? ఇలా ప్రశ్నలవర్షం కురిపిస్తున్న కూతుర్ని కేక్ తయారుచేస్తున్న తల్లి చూసి నీకు ఇష్టమైన కేక్ చేస్తున్నాను ఇది నీవు తిన్నాక నీ ప్రశ్నలకి సమాధానం వెదుకుదాం అన్న మాటలకి సరె అని..."నీవు చేసే కేక్ అంటే నాకు అమితమైన ఇష్టం".
అమ్మ: కాస్త డాల్డాని అందివ్వు..
కూతురు: ఛా ఇదేంటో ఇంత జిడ్డుగా ఉంది!
అమ్మ: ఆ 4 కోడిగుడ్లని కూడా పగులగొట్టి అందులో వేయి, అలాగే ఆ మైదాపిండిని కూడా, అదే చేత్తో చిటికెడు సోడా తీసుకుని కలుపు..
కూతురు: యాక్ :( ఇదేంటమ్మా ఈ గుడ్లు ఇంత వాసన వస్తున్నాయి, ఈ పిండి ఇలా రబ్బర్ లా సాగుతుంది....చూస్తుంటేనే అసహ్యంగా ఉన్నాయి!
అమ్మ: అవును అవి అన్నీ అలా విడివిడిగా అలాగే ఉంటాయి, కానీ వాటినన్నింటినీ సమపాళ్ళలో కలిపి సక్రమంగా ఉడకనిస్తే....నీకు ఇష్టమైన రుచికరమైన కేక్ తయారౌతుంది.

అలాగే మన పనులు కూడా......ఇష్టమైన విధంగా జరగాలంటే  విసుగు, చిరాకు లేకుండా మనకి జరుగుతున్న విషయాలని కష్టం అనుకోకుండా సక్రమంగా ఆలోచించి ఆచరణలో పెట్టి శ్రమపడితే తగిన సమయానికి మనం ఆశించిన ఫలితాలు మనకి దక్కుతాయి. అవే మనం జీవితంలో ముందుకు సాగడానికి కిక్కునిస్తాయి :)

9 comments:

  1. vav, chaala chakkaga undi mee chinna story.

    ReplyDelete
  2. mi blog baavundi mi kaburlu manchi maatalu chaalaa baavunnayi

    ReplyDelete
  3. కొత్తగా అలంకరించిన బ్లాగ్ భలే బాగుందండి.
    మీ రిఎంట్రీ కూడా అదిరింది..కొనసాగించండి.

    ReplyDelete
  4. భలే చెప్పారు.... ఒక మంచి విషయాన్ని చక్కని కధ సహాయంతో..
    నాకు బాగా నచ్చింది..

    ReplyDelete
  5. మీ అమ్మాయి అదృష్టవంతురాలు...
    ఇంతందంగా చెప్పే అమ్ముంది తనకి!

    ReplyDelete
  6. చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
  7. పిల్లలకు ఇలా సరికొత్తగా చెప్పటం!పిల్లల మనసుల్లోకి సూటిగా వెళుతుంది.

    ReplyDelete
  8. మీ అందరి ప్రేరణాజల్లులకు ప్రణామములు.

    ReplyDelete