జఫాన్ వాళ్ళకి తాజా చేపలంటే చాలా ఇష్టం.
కానీ వారికి దగ్గరలో నీటివనరులు లేకపోవడంతో చేపలుపట్టి ఐస్ లో నిలువ చేసుకునేవారంట. కానీ దానివల్ల చేపల్లో తాజాదనం నశించి అవి తక్కువ ధరకి అమ్ముడుపోయి వ్యాపారస్తులకి నష్టం వాటిల్లుతున్నదని పెద్ద ట్యాంకుల్లో చేపల్ని పట్టి వాటిని అందులో పెంచసాగారు. అయినా అవి కొన్నిరోజులకే నిస్సత్తువగా మారి అక్కడక్కడే తిరుగుతూ ముందు ఉన్న రుచి తగ్గిందని గమనించి ఆ పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఆ చేపలతో పాటు ఒక షార్క్ చేపని కూడా వేయడంతో చేపలన్నీ ప్రాణభయంతో ట్యాంకతా కలియ తిరుగుతూ చలాకీగా ఉండేసరికి జఫాన్ వాసులకి తాజా రుచికరమైన చేపల్ని ఆరగించే అవకాశం వారిసొంతమైంది.
గమనించారా.....
మనంకూడా కొన్నిసార్లు అలా నిస్సత్తువతో, నిస్తేజంగా జీవిస్తుంటాం. అలాకాకుండా జీవితంలోని ఒడిదుడుకులకు నిరాశపడక సవాలు అనే షార్క్ చేపల్ని మన మైండ్ అనే ట్యాంకులోకి వదిలితే మనం కూడా చాకచక్యంతో నైపుణ్యంగా కష్టాలని ఎదిరించి ముందుకుసాగిపోతాం.
ముందుకు సాగిపోయి ఏం లాభం ఎవరికో ఒకరికి ఆ చేపల్లా బలికావలసిందేకదా అని అనుకునేవారికి....ఎప్పుడో ఒకప్పుడు అంతమైయ్యేదే కదా అలా కనీసం పరులకోసం పనికొచ్చేలా (రుచికరమైన ఆహారంలా) పోతే పరమార్థం కదా అంటాను.
మీరు ఏమనితిట్టుకున్నాసరే!!!

పద్మారాణి గారూ!
ReplyDeleteమీ ఆలోచన దివ్యంగా ఉంది...
సమస్యలు వచ్చినపుడే మన సామర్థ్యం మరింత పెరుగుతుంది..
అభినందనలు మీకు...
@శ్రీ
మీరు ఇలా అరటిపండు ఒలచి చేతిలో పెట్టినట్లు వివరించడం బాగుందండి.
ReplyDeleteinkemantaam chiru chepalni chesi elaa masalukovaalo cheppina meeku thanks antaam
ReplyDeleteచక్కగా వివరించారు.
ReplyDeleteబాగుందండీ...నీరవ నిస్సత్తువని పారదోలే రహస్యాన్ని చెప్పి సార్థక నామధేయులనిపించుకున్నారు...అభినందనలు..
ReplyDelete