Thursday, August 2, 2012

రక్షించేబంధమా?

హాయ్ ఫ్రెండ్స్! "రక్షాబంధనం" అంటే రక్షణ కోరుతూ ఒక బంధాన్ని ఇరువ్యక్తుల మధ్య సృష్టించుకోవడం అని ఒక ప్రముఖవ్యక్తి చెప్పగా విని నాలో కలిగిన భావాలని మీతో పంచుకోవాలని నా ఈ చిన్ని ప్రయత్నం.
ఒకవేళ పైన చెప్పినట్లు ఇరువ్యక్తుల నడుమ ఆ బంధమే రక్షించేదైతే అది అన్నాచెల్లెళ్ళ మధ్యనే ఎందుకో అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, మేనకోడలుమామలు, బావామరదళ్ళు ఇలా ఒకరికొకరు ఎవరు రక్షిస్తారు అనుకుంటే వాళ్ళకే ఈ "రాఖీ" కట్టొచ్చుకదా!
పోనీ లింగ భేధముంటేనే రక్షిస్తారు అది కూడా మగవారు ఆడవారినే కాపాడతారు అనుకుంటే ఆఫీసులో ఉన్న బాస్ కి రాఖీ కడతామంటే చాలామంది బాస్ లు ఎందుకు వద్దంటారో! 
నా ఈ మట్టిబుర్రకి తోచిన చెత్త ఆలోచనలని తోసిపారేయకుండా, ఆలోచించి బదులిస్తారని ఆశిస్తూ...
ఏమైనా ఒక బంధం రక్షిస్తుంది అనుకుంటే ఆ బంధానికి నేను బద్ధురాలిని....అందుకే అందరికీ "రక్షాబంధనం" శుభాకాంక్షలు తెలియజేస్తున్నా!!!


11 comments:

  1. పెళ్ళిలో వుండే సుఖాన్ని ఎవరైనా ఇవ్వగలిగినప్పుడు మొగుడే ఎందుకు అని అడిగినట్లు వుంది మీ ప్రశ్న,అలోచన

    ReplyDelete
    Replies
    1. నిజానికి సుఖాన్నాశించే పెళ్ళి చేసుకుంటారని మీరనుకుంటే దానికి పెళ్ళెందుకు..పోనీ పెళ్ళి చేసుకున్న వారు ఆ బంధానికి కట్టుబడి మరో వైపు చూడరని గ్యారంటీ వుందా?? ఏదైనా మనఃస్సాక్షికి సంబందించినదే..పోస్టులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా ఇలా అడగడంలోనే మీ బుద్ధి అర్థమవుతోంది..

      Delete
  2. ప్రేరణ గారూ రక్షాబంధన్ శుభాకాంక్షలండీ....

    ReplyDelete
  3. దేనినైనా అర్థం చేసుకొనే మనసుండాలి కదండీ..తాడు కట్టినంత మాత్రాన రక్షించే హీరో అయిపోతారా ఎవరైనా?? ఇదంతా ఓ వ్యాపార సంస్కృతి..ప్రతి దానిని సరుకుగా మార్చి చూసే బుద్ధి..వాలెంటైన్ డేలు అమ్మలకు నాన్నలకు రోజులు జరపడాలులాంటిదే...ఉన్నప్పుడు ఎవరికి వారి విలువ తెలీదు.. ఎవడి బిజీ బతుకు వాడిదే..నన్ను ముట్టుకోకు నామాల కాకిలా తయారయిన నేటి వ్యక్తుల సమూహాలుగా విడిపోయిన మనం ఓ బూటకపు ఆలోచనలతో గడిపేయడానికే ఇవన్నీ..మీ పోస్ట్ ఆలోచించ తగ్గది..అభినందనలు..

    ReplyDelete
  4. మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు .

    ReplyDelete
  5. రక్షాబంధన శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. ఆఫీసు అన్నది ఒక వ్యాపారం. అక్కడ బంధాలు, బాంధవ్యాలు ఉండకూడదు. ఆఫీసులోవారికి రాఖీ కట్టడం సమంజసం కాదు.

    http://100telugublogs.blogspot.com

    .

    ReplyDelete
  7. ఈ పండగని మన సంప్రదాయం నుండి చూస్తే...అన్న,చెల్లి,అక్కా,తమ్ముడు రెలషన్స్ ని బలంగా చేయడానికే అని అర్థం అవుతుంది.పెల్లి కాక ముందు మనం ఇంట్లొ పోట్లాడుకున్న,సరిగ్గా మాట్లాడుకొకున్నా ఈ పండగ మార్చేస్తుంది,కాని పెల్లి అయిన తర్వాత ఈ పండగ పేరు చెప్పుకుని అమ్మ వాళ్ళా ఇంటికి వచ్చి మంచి చెడు చర్చిస్తారు (అత్తారింట్లొ సదక బాదలు )ఒకప్పుడూ మాట మాటా పెరిగితే అమ్మయికి ఈ పండగ అమ్మరింటికి వెల్లే ఒక చాన్స్ ఇస్తుంది ఇలాగే భగినీ హస్త భొజనం అనె మరొ చిన్న పండగ ఉంటుంది దాని ప్రకారం అన్నయ్య తన సోదరి ఇంటికి వెల్లి భొజనం చేసి రావాలి సొ తను అత్తారింట్లో చెల్లి స్తితిని అంచనా వేస్తడు ఇవన్నీ మన సంప్రదాయం లో నిగూడంగా దాగిన కిటుకులు.ఇహ ఈ పండగ కారణంగానే ఆడ పిల్లలు పెల్లి తర్వాత ఏమైన గొడవలు ఉన్నా అమ్మరింటికి రాక పోకలు సాగించిన కథ లు కోకొల్లలు ,ఇక పోతే ఆఫిస్ లొ బంధాలు బండముక్కలు ఎందుకండి అదీ ఈ కార్పొరట్ కల్చర్ లొ అనవసరం(నాకైతే బాగా గుర్తు మా స్కూల్ లొ టీచర్స్ రాకీలు కట్టుకునే వాళ్ళు)......మనం మారుతున్నాం కాలం మారుతోంది అని అన్నింటినీ వదులు కోవడం గొప్ప అయి పోయింది కాని మన సంప్రదయం లోని లోగుట్టూ తెలియక రాకీ వద్దు అంటాం కాని మొరొ వ్యక్తి తో రెలషన్ డెవెలప్ చేసుకొవడానికి ఇదొక మంచి అవకాశం(అందుకే విదేశీయులు ఈ పండగని కాపి కొట్టారు రెండు ఆగస్ట్ మాసం లోనే వస్తయి కదా)

    ReplyDelete
  8. ఆశ్చర్యం
    ఆనందంతో కూడిన ప్రశ్న..
    సంధర్భోచితం

    ReplyDelete