Sunday, November 11, 2012

పుర్రెకో ఆలోచన!

ఒక మానేజర్, వాళ్ళ అసిస్టెంట్, ఒక తల్లి, వాళ్ళ అమ్మాయి కలిసి ట్రైన్ లో ప్రయాణమై వెళుతున్నారు. ప్రయాణంలో పలకరింపులతో పరిచయాలయ్యాక పిచ్చాపాటి మాటలతో స్నేహితులయ్యారు.
కొద్దిసేపటికి ఒక పెద్ద టన్నల్ వచ్చి దానిగుండా ట్రైన్ వెళ్ళడంవలన బోగీలో చీకటి వ్యాపించింది. అంతలో అకస్మాత్తుగా ఎవరినో ముద్దాడిన మరియు వెంటనే చెంపగుయ్యిమన్న శబ్ధం వినిపించాయి. మరి కొద్ది క్షణాలకి టన్నల్ నుండి టైన్ వెలుగులోకి వచ్చింది.
ఆ పెద్దావిడ, అసిస్టెంట్ ఎదురెదురుగా కూర్చుని ఒకరి ముఖం వంక మరొకరు అయోమయంగా చూసుకుంటుంటే, మానేజర్ ఎర్రగా కమిలిన ముఖాన్ని రుద్దుకుంటూ కూర్చున్నాడు.
ఎవరికి వారే ఒకరితో ఒకరు ఏమీ చెప్పుకోకుండానే ఒకరి గురించి ఒకరు ఇలా అనుకుంటున్నారు.

పెద్దావిడ:- మానేజర్ ఏదో చెడుబుధ్ధితో మా అమ్మాయిని ముద్దాడబోతే భలే బుద్ది చెప్పిందిలే వెధవకి అనుకుంది.
అమ్మాయి:- బహుశా మానేజర్ నన్ననుకుని మా అమ్మని ముద్దాడి చెంపదెబ్బ తిన్నాడు అనుకుంది.
మానేజర్:-ఛా!....ఛా! ఈ అసిస్టెంట్ కి బుద్ధిలేదు, ఆ అమ్మాయిని వీడు ముద్దు పెట్టుకుంటే నేనే ఆ పని చేసాననుకుని నన్ను చెంపదెబ్బ వేసింది అనుకున్నాడు.
అసిస్టెంట్:- ఈ సారి ఇంకో టన్నల్ వచ్చినప్పుడు మరలా ముద్దాడినట్లు శబ్ధం చేసి మా మానేజర్ ని ఇంకాస్త గట్టిగా చెంపదెబ్బ వేయాలి. రాస్కెల్....అఫీసులో కాల్చుకు తింటున్నాడు అనుకున్నాడు:-)

10 comments:

  1. మీరు రాసిన జోక్ చూస్తే "లా" చదివే రోజుల్లో నెను చేసిన చిలిపి పని గుర్తుకు వచ్చింది. నేను విజయవాడలో లా చేసే రోజుల్లో మా అక్క గారి దగ్గరకు అడవి నెక్కలం అనే వూరు వెళ్లి రాత్రికి విజయవాడ తిరుగు ప్రయాణమయ్యాను.నేనెక్కిన బస్సు నిండా కాలేజి అమ్మాయిలు, అబ్బాయిలు తోటల్లోకి పిక్నిక్ వెళ్లి వస్తునట్టున్నారు,చాల రష్ గా ఉంది. పాసెంజర్ బస్సు కావటం మూలాన డ్రైవర్ ప్రతి చోట ఆపుతూ,స్టేజ్ దాటగానే లైట్ తీసేస్తున్నాడు.అలా లైట్లు ఆర్పిన ప్రతిసారి నా వెనుక నున్న స్టూడెంట్ నా ముందున్న వాడిని నెట్టి మీద కొడుతూ టీజ్ చేస్తుంటే ముమ్దున్న వాడు లైట్లు వేసాక వెనుక ఉన్నవాడిని కొడుతూ గోల చేస్తుంటే నాకు చాల ఇబ్బందిగా ఉంది.అందుకే నేను ఒక ఉపాయం ఆలొచించి ఈ సారి లైట్ తీయగానే చీకట్లొ ముందున్న వాడిని గట్టిగా కొట్టాను. అంతే ! వాడు ఒక్క అరుపు అరచి అప్పటి దాక వాడిని టీజ్ చేస్తున్న వాడిని ఆ చీకట్లోనే పెడి,పెడి మని కోట్టెసరికి బస్సు ఆగటం,వారివురు,ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, బస్సులోని జనం వారిద్దర్ని తిట్టడం,బస్సు బయలుదేరి విజయవాడ రావడం నేను నవ్వుకుంటు దిగిపోవడం జరిగిపోయాయి.అదీ సంగతి.

    ReplyDelete
  2. eeroju poddunne fb lo navvinchaaru...ipudu ikkada koodaa navvutunnanu...baagundi...@sri

    ReplyDelete
  3. ఇదే మీ బ్లాగ్ చూడడం ప్రేరణ గారు !
    చాల బాగా రాసారు ,అసభ్యత లేకుండా సున్నితమైన హాస్యాన్ని జొప్పించారు ! ఆ మేనేజర్ క్యారెక్టర్ ని బాగా depict చేసారు
    -హర్ష

    ReplyDelete
  4. సున్నితమైన హాస్యాన్ని పండించారు. బాగుంది:-)

    ReplyDelete
  5. విషయమేదైనా చక్కగా చెప్తారండి మీరు.

    ReplyDelete
  6. so u wanna live in fools paradise so be it

    ReplyDelete
  7. ప్రతీకారం తీసుకోడానికి ఇదేదో బాగుందే:-)

    ReplyDelete