Sunday, November 4, 2012

బాడ్ లక్/గుడ్ లక్?

మేము కొత్తకారు కొన్న మర్నాడే ఆ బ్రాండ్ కార్ల రేటు 30వేలు తగ్గేసరికి చుట్టు పక్కలవాళ్ళంతా అయ్యో ఎంత “బాడ్ లక్” అంటూ జాలిచూపిస్తూ మనసులో మాత్రం భలే భలే అనుకుని మా కారుని చూసి కాస్త ఈర్ష్య పడ్డారు. నేను మాత్రం….”బాడ్ లక్?  “గుడ్ లక్?
ఎంటో చూడాలి అనుకున్నా.
కొన్న నెలలోనే అతితక్కువ ధర్లో ఇల్లొకటి కారుచౌకగా వస్తే కొన్నాము…..ఇది విని బంధువులంతా, భలే చౌక బేరము కారొచ్చిన వేళ మీకు కల్సొచ్చింది ఎంత “గుడ్ లక్” కదా అని పైకి అన్నా ఎక్కడిదో ఇంత డబ్బు అని మనసులో అనుకుని కాస్త అసూయ పడ్డారు. నేను మాత్రం “గుడ్ లక్?  “బాడ్ లక్? చూద్దాంలే అనుకున్నా.
ఇంకో పదిరోజులకి మా కుటుంబమంతా కలసి కార్లో ఊరు వెళితే యాక్సిడెంట్ అయ్యి నా కాలు విరిగింది….అందరూ ఛా! శనివారం ఇనపవస్తువు అందులోను ఈ కారు అచ్చిరాలేదు అందుకే ఇలా అయ్యిందంటూ మాకిది “బాడ్ లక్! ఆని పాపం ఆ నోరులేని కారుని ఆడిపోసుకున్నారు. నేను మాత్రం కిమ్మనకుండా కాలికి కట్టువేసుకుని కూర్చున్నా.
మరో ఆరువారాలకి నా కాలు పూర్తిగా నయమయ్యాక, మా ఫ్రెండ్స్ అందరూ కలవకుర్తిలో ఒక ఫంక్షన్ లో కలుసుకుని అక్కడి నుండి అందరం ఒక సుమో మాట్లాడుకుని హంపీ విజయనగరం వెళ్ళాలనుకున్నాము. ఎప్పుడూ తన విధిని సక్రమంగా నిర్వర్తించే మాకారు ఆరోజు సిటీ దాటి బయటికి అడుగిడనంటూ మొరాయించి అవుటర్ రింగ్ రోడ్లోనే ఆగిపోయింది....….చేసేదేం లేక అప్పటికే ఆరు గంటలు ఆలస్యమైందని నేను ప్రయాణం ఆపుకుంటే, వాళ్ళంతా ఫంక్షన్ లో కలిసి అక్కడినుండి హంపీకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన సుమో లారీకి గుద్దుకుని ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్రగాయాలై బయటపడ్డారు.
“బాడ్ లక్? లేక “గుడ్ లక్? అని ఎవరిని అడగాలో తెలియక మౌనంగా ఉన్నా….  

14 comments:

  1. జరిగిన దానిని బట్టి బేరీజు వేసుకొని మనమనుకునేదే కానీ అదృష్టం దురదృష్టం ప్రత్యేకంగా ఏమీ వుండవన్నదే మీరు చెప్పింది కదా ప్రేరణ గారు.. బాగా చెప్పారు.. అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్ గా చెప్పారు.Thank you.

      Delete
  2. నిజమా, కల్పనా.....నిజమైతే మీ మిత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. ఇది ఇప్పుడు జరిగింది కాదండి చాలా ఏళ్ళక్రితం....ప్రస్తుతం అందరూ బాగున్నారు.

      Delete
  3. padma rani gaaroo!
    adrushtam...duradrushtam..manam kaalaanni batti marchesukuntaamu...
    evarinanaa pogadataanikee/...aadiposukodaaniki
    ivi baagaa panikostaayemo...!...baagaa vraasaaru...@sri

    ReplyDelete
    Replies
    1. అవునండి శ్రీగారు మీరుచెప్పినంట్లు ఇవి అవసరానికి వాడుకునే పదాయుధాలన్నమాట. బాగుందండి

      Delete
  4. Good luck/Bad luck- It is a matter of individual's perspective , that is all ప్రేరణ గారు.

    ReplyDelete
    Replies
    1. Ofcourse they may be individual's perspectives along with that they are inhibitors of success too....

      Delete
  5. According to our convenient & situation we change our words, this is the human tendency.But no doubt yours is GOOD POST:)

    ReplyDelete
    Replies
    1. Aniketh its depend upon the way we think. Thanks for you compliment.

      Delete
  6. పోస్ట్ చాలా బాగుంది పద్మ గారు :) అసలు లక్ అనేది నిజం కాదేమో..."there is no luck except where there is discipline" అన్నారు :)

    ReplyDelete
    Replies
    1. మీకు నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండి. I too agree with this.

      Delete
  7. బాద్నక్కో గుడ్నక్కో..ఇల ఇటు వైపెలిపొచ్చీసినాను... బాగా సెప్తున్నారు మీరు..నచ్చేసినారు....

    ReplyDelete