చాన్నాళ్ళుగా ఒక మంచి కవిత రాయాలని ఆశ. కానీ ఏం వ్రాయాలో తెలియక అందరూ వ్రాసే కవితల్ని చదివి వీళ్ళంతా ఎలా వ్రాయగలుగుతున్నారని ఆశ్చర్యపోతూ తెలిసిన నలుగురు కవిమిత్రులని సలహా అడిగితే....అలా వ్రాయడమంతా సరస్వతీదేవి కటాక్షమని సన్నగా నవ్వి చల్లగా జారుకున్నారు. మరునాటి నుండి మహా శ్రద్ధగా సరస్వతీదేవిని కొలవడం మొదలెట్టాను.
ఒకరేయి కల్పనల కడలిని ఎంత ఈదుతున్నా ఒక్క ముత్యం కూడా చేతికందనట్లుగా కల, చివరికి సరస్వతీదేవి నన్ను ఆశీర్వధించినట్లుంది అనుకుని నా మదిలోని భావాలకి రూపం ఇవ్వాలనుకునే లోపే ఆఫీస్ లో చేయాల్సిన పనులు గుర్తొచ్చి వాటి పై మనసు లగ్నం చేసి పనిపూర్తిచేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సంసారపు ఈతిభాధలతో సతమతమై సయనించే వేళకి సారమంతా పోయి నీరసం వచ్చి సాహిత్యమంతా మరచి సన్నగా ఒళ్ళంత సలుపుతుంటే కవిత్వం కాదుకదా కాళ్ళు కూడా కదపలేక నిద్రలోకి జారుకున్నా. తెల్లావారింది షరా మామూలే మళ్ళీ......
నాకర్థమైంది.....
"మానవ జీవితమే ఒక కవితా గానమని
కాగితంపై వ్రాసుకుని ఖుషీగా ఉండలేమని
రాజీపడుతూ సాగించడమే పయనమని"
మీ మూడు లైన్లు చదివివాక ఇప్పుడు కవితలు రాయలేకపోతున్నానన్న బెంగ లేదండి.
ReplyDeleteyes ప్రేరణ గారు.. ఎవరూ కాదనలేని నిజాన్ని చెప్పారు.. చిత్రం చాలా బాగుంది..
ReplyDelete