Tuesday, May 28, 2013

మనసుకో ముసుగు...

ఆలోచలు పరిస్థితులకనుకూలంగా విడివేరైనాయి
మారలేనంటూ మారాంచేసి మనసే మారిపోయింది

తరాంతరాలు ఆలోచనల్ని మార్చుకోమంటున్నాయి
ఆశతో పెరిగిన ఆశయాలకీ ఒరవడి అసలు నచ్చకుంది

తప్పొప్పులతూనికలు తూగలేమంటు తప్పించుకున్నాయి
కడతేరని కోరిక కన్నీటిలో ఇంకి వెక్కిరించి కనుమరుగైంది

మనస్సాక్షిని మమకారాల ముసురులు కమ్మేసుకున్నాయి
కొత్తాశలకి అంకురార్పణ చేయమని అనుబంధమడుగుతుంది

ఆకృతిదాల్చిన ఆలోచనలు సర్దుబాటంటూ సరిపెట్టుకున్నాయి
మనసు మాత్రం మరో ముసుగేసుకుని నవ్వుతూ సాగిపోయింది

5 comments:

  1. మనస్సాక్షిని మమకారాల ముసురులు కమ్మేసుకున్నాయి
    కొత్తాశలకి అంకురార్పణ చేయమని అనుబంధమడుగుతుంది..

    మనసులోని వేదనను, ఆలోచనా స్రవంతిని ఇలా పదబంధంలో బంధించడం చాలా నచ్చింది ప్రేరణ గారు. జీవితం ఎక్కడికక్కడ సర్దుబాటు మడతలలోకి జారిపోతూ మనమిలా ఒదిగి ఒరిగి పోవడం విషాదమే. కానీ మరపు ఆయుధంతో ఆనందాన్ని ముసుగేసుకోక తప్పని స్థితి.

    కవితకు అభినందనలతో..

    ReplyDelete

  2. మనసు మాత్రం మరో ముసుగేసుకుని నవ్వుతూ సాగిపోయింది

    ఈ పై లైన్ చాలా చమత్కారపూర్వకంగా , అందంగా వున్నది , నీ ప్రేరణతో .

    ReplyDelete
  3. ప్రయత్నిస్తే మీరు ఇంకా బాగారాయగలరు మీ ట్రెండ్ని సెట్ చేసుకోగలరు. బాగుందండి.

    ReplyDelete
  4. చాలాబాగా వ్యక్తపరిచారండి మీ భావాలని.

    ReplyDelete