Tuesday, February 11, 2014

"నిజమైన ప్రేమ"

ఒకానొక సందర్భంలో నా కూతురు నన్నడిగింది...."నిజమైన ప్రేమ" చాలామందికి ఎందుకు దక్కదని?
సమాధానం తరువాత చెప్తాను ముందు వెళ్ళి తోటలోని కొన్ని అందమైన పెద్ద గులాబీలని కోసుకురమ్మన్నాను.
తోటంతా తిరిగి రెండుగంటల తరువాత తిరిగివచ్చి....తోటలో పూలని చూస్తే అందులో కొన్ని గులాబీలు అందంగా పెద్దగానే ఉన్నాయి, కానీ ఇంకా పెద్దవి అందమైన దొరుకుతాయని తోటంతా తిరిగి వెతికి వెనక్కి వచ్చి చూస్తే....ముందు చూసిన పూలని వేరెవరో కోసేసుకున్నారు అని దిగులుగా చెప్పింది.
అప్పుడు నేనన్నాను....."నిజమైన ప్రేమ" కూడా అంతే, ఎదురుగా ఉన్నప్పుడు అదంటే లెక్క చేయము, కావాలని కోరుకున్నప్పుడు అది వేరొకరి సొంతం అవుతుంది.

6 comments:

  1. అవును...ఎదురుగా ఉన్నప్పుడు అదంటే లెక్క చేయము, కావాలని కోరుకున్నప్పుడు అది వేరొకరి సొంతం అవుతుంది. బాగుంది రాణిగారు.

    ReplyDelete
  2. చాలా గొప్ప మాటలివి పద్మా రాణి గారు. జీవితం నేర్పిన పాఠాలను ఎంతో బాగా కుదించి, తెలుసుకోవాల్సిన అంశాన్ని కళ్ళ ముందుంచారు. మంచి మాటను మాకందించిన మీరు దన్యులు సుమీ !

    ReplyDelete
  3. తోటలో పూలలో కొన్ని గులాబీలు అందంగా పెద్దగానే ఉన్నాయి, ఇంకా పెద్దవి అందమైనవి దొరుకుతాయని తోటంతా తిరిగి వెతికి వెనక్కి వచ్చి చూస్తే....ముందు చూసిన పూలని వేరెవరో కోసేసుకున్నారు.
    చాలా బాగా చెప్పారు.
    అభినందనలు ప్రేరణ గారు! శుభోదయం!

    ReplyDelete
  4. చక్కగా సెలవిచ్చారు

    ReplyDelete
  5. మీరేం చెప్పినా సూటిగా హత్తుకునేలా చెప్తారు. కాదనగలమా పద్మారాణి గారు.. పాప ఎంత అదృష్టవంతురాలో కదా.. అభినందనలు యిద్దరికీ..

    ReplyDelete
  6. మీరు ఇలా సునాయసంగా ఏ విషయాన్నైనా విడమరచి చెప్పేయగలరు.

    ReplyDelete