Saturday, April 5, 2014

!!నా గడియలు!!

ఏమైనాయి ఆ రేయింబగలు కాపుకాసిన గడియలు

జీవితాన్నే తృంచి పంచిచ్చిన నావి కాని నా క్షణాలు

నా వంతు నిద్రదోచిన నీనవ్వు చూసిన నా నవ్వులు

నా నోటికి కాక నీ నోటికి అందించిన అన్నం ముద్దలు

నా సుఖమంటే నీవంటూ నిర్వచించిన ఆ గురుతులు

ఏదేమైనా నాకొద్దు గతించిన ముసలిస్మృతి దొంతరలు

ఇచ్చిచూడు గుప్పెడు నాగుండెకు నీ ప్రేమానురాగాలు

తలచుకో కూడి నలుగురితో నిన్ను చెక్కిన నా చేతులు

ఇలాగైనా తనివి తీరనీ జీవితపు నా అంతిమ గడియలు

8 comments:

  1. Very nice ,really heart touching padmagaaru.

    ReplyDelete
  2. "ఏదేమైనా నాకొద్దు గతించిన ముసలిస్మృతి దొంతరలు
    ఇచ్చిచూడు గుప్పెడు నాగుండెకు నీ ప్రేమానురాగాలు"

    ఎందుకీలాంటి కవిత........ పద్మారాణి గారూ ?
    మనస్సుని మరీ మరీ పిండేయడం తప్ప - అని ప్రశ్నిస్తే,
    మీ నుండి మాకందే సమాధానం ..........
    " అన్ని రసాల కవితా దారలు ఉండాలంటారు " మీరు.
    చదివి బావుందని అనుకున్నా ......
    కరిగి కదిలిన గుండెను చూస్తే జాలేస్తుంది.
    కవిత ఆసాంతం చదివాక గమనించా, కళ్ళు చెమ్మగిల్లయాని.
    గుప్పెడు గుండె ఎంతుకింత 'వ్యధ' కు గురైందో - పాపం.
    *శ్రీపాద

    ReplyDelete
  3. ఆర్ద్రత నిండిన కవిత , మీ పదాల అల్లికలో నూతనత్వం ఉందండి

    ReplyDelete
  4. కంటనీరు పెట్టించారు మేడం

    ReplyDelete
  5. ప్రతి పదంలోను ఆర్థ్రతను నింపారు పద్మారాణి గారు.

    ReplyDelete
  6. సమాజంలోని సత్యాలను మీదైన రీతిలో చెప్తున్నారు.

    ReplyDelete