Friday, March 28, 2014

!!ఏమార్పు!!

వరదలా పొంగిపొర్లే భావాలను దాచి..
నదిలాంటి ఆశల ధృఢనివాసం కట్టలేవు

అడవిలో తూఫాను హెచ్చరితో అరచి..
కాండానికి ఊహల ఊయలకట్టి ఊగలేవు

విరిగినద్దంలో ముక్కలైన మోము చూసి..
ముఖకవళికలు మార్చానని ఏమార్చలేవు

తీయనిమభ్య మాటల తివాచీ ఏదో పరచి..
అరికాలు కడిగి  మది మలినం తుడవలేవు

రాగయుక్తంగా భావంలేని గీతం ఆలపించి..
అవిటితనచేతి చప్పట్లు విని ఆనందించలేవు

పచ్చని తోరణాలుకట్టి వాయిద్యాలు మ్రోగించి..
చావుని కళ్యాణ కార్యక్రమమంటూ చూపలేవు

7 comments:

  1. ప్రేరణ గారూ ... మీకు మీరే సాటి అని మీ ఈ కవిత ప్రతి కోణం లోంచి తీపి చేదుల మిశ్రమాలను ఉగాదికి ముందే పంచినట్లనిపించింది.
    " తీయనిమభ్య మాటల తివాచీ ఏదో పరచి..
    అరికాలు కడిగి మది మలినం తుడవలేవు "
    మీ ఆలోచనా పరిధికి అవధులు లేవనిపిస్తుంది పై భావాలను అర్ధం చేసుకుంటే .
    పండితులను కూడా "పటుత్వం" ఉందని మెప్పించే పదాలు మీవి. అభినందనలు .
    *శ్రిపాద.

    ReplyDelete
  2. బాగుంది మీరు చెప్పిన విధానం

    ReplyDelete
  3. తీయనిమభ్య మాటల తివాచీ ఏదో పరచి..
    అరికాలు కడిగి మది మలినం తుడవలేవు"
    పై వాఖ్యాలు మీ అద్భుత కవనాన్ని తెలియజేస్తున్నాయి,
    ఎన్నోసార్లు చదివాను. ప్రేరణగారూ అభినందనలు.

    ReplyDelete
  4. తీయనిమభ్య మాటల తివాచీ ఏదో పరచి....అరికాలు కడిగి, మది మలినం తుడవలేవు
    చాలా చాలా బాగా వ్రాసారు
    అభినందనలు ప్రేరణ గారు!

    ReplyDelete
  5. అక్షరసత్యాలు మనసుకి హత్తుకునే విధంగా చెప్పారు

    ReplyDelete
  6. వాడి అక్షరాలతో బాణాలు వేసారు

    ReplyDelete
  7. అవిటితనం చేతి చప్పట్లు....అద్భుత పద ప్రయోగం

    ReplyDelete