Sunday, May 11, 2014

!!అప్పుగా ఆనందం!!

వాదనలు ఎందుకని వలయంలో చిక్కి

నాణెంపై బొమ్మను చూసి బొరుసు గీసి

బాలింతకాలేని బాల్యానికి బారసాల చేసి

భాధ్యతలంటూ ఆర్భాటాల నడుమ నలిగి

ఆనందాన్ని కాస్త అరువు ఇవ్వమనడిగితే

కుదవు పెట్టడానికి భాధలేగా మిగిలాయంది

కన్నీటితో కనకమేకాదు కన్నపేగూ కరగనంది.

7 comments:

  1. కన్నపేగు బంధం బాధ్యతల నడుమ నలిగే అమ్మ మనసు ఆవేదనకు జోహార్లు పద్మారాణి గారు. చివరిలైన్ కన్నీళ్ళు తెప్పించింది.

    ReplyDelete
  2. పద్మా రాణి గారూ !

    మీ " అప్పుగా ఆనందం ' లో ప్రతి వాక్యమూ
    అతీతమైన మానవ విలువలను ప్రస్పుటింపజేస్తున్నాయి.

    కవిత కొంత భారంగా ఉంది .
    అయినా ఆస్వాదించాము అందులోని భాదలనీ, భావాలనీ.

    కవిత చిన్నదే అయినా భావం మెండు .
    బాగుంది.
    అభినందనలు పద్మా రాణి గారు.

    * శ్రీపాద

    ReplyDelete
  3. అధ్భుతమైన భావం కానీ వ్యథాభరితం పద్మగారు.

    ReplyDelete
  4. కుదవు పెట్టడానికి భాధలే మిగిలి, కనకమేకాదు కన్నపేగూ కరగని స్థితి .... కన్నీటితో
    ఎంతో దయనీయం గా ....

    ReplyDelete
  5. అధ్భుతమైన భావం పద్మ రాణి గారు

    ReplyDelete