Tuesday, May 20, 2014

చిగురువేయడమెలా?

గుండెగదిలో బంధించి తలుపు మూసి
తాళంవేసి గొళ్ళెం వేయ మరచినంతనే
చెప్పలేనని చల్లగా జారుకుని జీవించేస్తే
ఎదను కోసిన కసాయిని ఏమనుకోవాలి?

సాగరమంత స్వార్థంలేని ప్రేమనే పంచినా
నీటిబిందువంత నిర్మల ప్రేమనీయనన్నా
అనురాగ ఆస్తుల వీలునామా అందచేస్తే
కాసులకి కుదవు పెడతానంటే ఏమనాలి?

అనురాగపందిరిని చిక్కుల వలగా చూసి
మెరిసేదంతా బంగారమని బంధాన్నివీడి
బరువు భాధ్యతలు తీర్చుకునే బంధమైతే
వేరులేని కాడను ఎలా చిగురింపజేయాలి?

7 comments:

  1. పద్మా రాణి గారూ !

    భారమైన కవితలు రాయడం అలవాటయి పోయింది మీకు.
    గుండెను బరువుగా చేసుకోవడం పరిపాటయింది మాకు.
    అయితే మంచి సాహిత్యాన్ని భారమైన మాటల్లోనే బాగా
    చెప్పొచ్చేమో. మంచి కవిత మరో మారు మీ కలం నుండి.
    అభినందనలు.
    ముఖ్యంగా ...
    " సాగరమంత స్వార్థంలేని ప్రేమనే పంచినా
    నీటిబిందువంత నిర్మల ప్రేమనీయనన్నా
    అనురాగ ఆస్తుల వీలునామా అందచేస్తే
    కాసులకి కుదవు పెడతానంటే ఏమనాలి? "

    గుండె అలజడికి లోనయింది కాసేపు మీ కవిత చదివాక.

    చాలా బాగుందండీ పద్మా రాణీ గారు.
    *శ్రీపాద

    ReplyDelete
  2. మీరు చిత్రంలో ముద్దుగుమ్మలా ఉన్నారు, మీకు వేదనతో మమ్మల్ని కట్టి పడేయడం బాగావచ్చునండి

    ReplyDelete
  3. చక్కని భావ వేదనావేశాన్ని పలికించారు కవితలో

    ReplyDelete
  4. గుండెగదిలో బంధించబడిన ఎదను కోసిన కసాయి
    సాగరమంత స్వార్థంలేని ప్రేమను కాసులకి కుదవు పెడతానంటే
    అనురాగపందిరి చిక్కుల వలలో వేరులేని కాడ చిగురింపజేసేదెలా?

    చాలా చాలా గొప్ప గా .... ఆక్షేపణ అనుకోలేని ఆవేశం కవిత గా
    అభినందనలు ప్రేరణ గారు!

    ReplyDelete
  5. అనురాగ ఆస్తుల వీలునామా అందచేస్తే
    కాసులకి కుదవు పెడతానంటే ఏమనాలి?
    బరువు భాధ్యతలు తీర్చుకునే బంధమైతే
    వేరులేని కాడను ఎలా చిగురింపజేయాలి?
    ఇలా ఎదనుకోసే ప్రశ్నలు వేస్తే ఎలా?
    భాధనే అయినా బాగామలిచారు.

    ReplyDelete
  6. ఎద భారమయ్యే భారాల మణిహారం

    ReplyDelete