Sunday, June 1, 2014

!!ఊరట!!

ఉత్తుత్తి మాటలతో ఊరడించి
ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపి
ఉన్నంతలోనే ఏదో ఊరటపడి
ఉప్పెనై పొంగనేల ఎదలోయల్లో!!

ఉన్నదున్నట్లుగా విని ఊకొట్టి
ఉబుసుపోక ఊసులాడ్డం మాని
ఉప్పెనేదైనా ఎదురీది నిలవాలని
ఉబలాటపడే పంతముంది నాలో!!

ఉనికినేమార్చి స్మృతులకి ఉరివేసి
ఉత్సాహమే నన్ను ఊరట కోరేలా
ఉన్నత లక్ష్యాలనే ఊపిరి చేసుకుని
ఉదరకోతైనా హుందాగా బ్రతుకుతా!!

4 comments:


  1. " ఉనికినేమార్చి స్మృతులకి ఉరివేసి
    ఉత్సాహమే నన్ను ఊరట కోరేలా
    ఉన్నత లక్ష్యాలనే ఊపిరి చేసుకుని
    ఉదరకోతైనా హుందాగా బ్రతుకుతా!! "

    అతీతమైన ఆవేదనకు గుండె యెద గురైనప్పుడు,
    మనసులోంచి ఉబికివచ్చే బరువైన భావనలివి.
    ఎంతటి క్లిష్టమైన పడజాలాన్నైనా ,
    అలవోకగా అల్లగలిగిన అణుకువ మీది పద్మ గారు.
    అందుకే ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయి
    అపర సరస్వతీగా అలరిస్తున్నా రందరిని .

    ఆత్మ స్థ్యర్యం ఎంత గొప్పదో అద్భుతంగా వినిపించారు.
    కవిత చిన్నదే అయినా కదిలించింది -
    ఊరట నందించిందీ కూడానూ .

    బాగుంది పద్మగారు..........
    మీ బరువైన భావనల మూట.

    *శ్రీపాద

    ReplyDelete
  2. ఇలా రాస్తూ అందరికీ ప్రేరణ మీరు.

    ReplyDelete
    Replies
    1. మీరన్న మాట అక్షరాల నిజం 'మయా విశ్వం' గారూ .
      ఆ ప్రేరణను నీను అందుకున్నా.
      *శ్రీపాద

      Delete
  3. ఉన్నంతలోనే .... ఊరటపడి, ఉప్పెనైనా ఎదురీది నిలవాలని, ఉన్నత లక్ష్యాలనే ఊపిరి చేసుకుని
    చక్కని లక్ష్యం

    ReplyDelete