Friday, September 26, 2014

!!అమ్మ మూల్యం!!

తెలిసీ తెలియని వయసులో నా కూతురు వంట చేస్తుంటే నా దగ్గరగా వచ్చి చిన్నికాగితంలో ఏదో లిస్ట్ రాసి చూసి డబ్బులు ఇవ్వమంది.
అందులోని సారాంశం....
పుస్తాకాలు చక్కగా సర్దుకున్నందుకు:-   రూ  20-00
మంచి మార్కులకి తెచ్చుకున్నందుకు:-       20-00
బజారుకి వెళ్ళి సరుకులు తెచ్చినందుకు:-      20-00
ఇల్లు సర్దడంలో సహాయపడినందుకు:-          50-00
నీకు నచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు:-           40-00
                                                              ----------
                      మొత్తం- - - - - - - - - --    150-00
నేను అలా అమాయకంగా నించుని చూస్తున్న తనని చూసి నవ్వుతూ కాగితాన్ని తిప్పి ఇలా రాసాను.....
తొమ్మిది నెలలు మోసినందుకు కూలి......రు:-    00-00
నిద్రలేకుండా రాత్రులెన్నో గడిపినందుకు:-       00-00
నీ ముక్కు చీది నిన్ను శుబ్రపరిచినందుకు...    00-00
ఆలనాపాలనా చూసి ఆడించినందుకు           00-00
                                                              -----------
మొత్తంగా చూసి అంతా కూడితే ....               00-00
అది చదివి నా కూతురు సారీ అమ్మా అంటూ నన్ను గట్టిగా హత్తుకుని "ఐ లవ్ యూ" అంది. వెంటనే నేను తనని ముద్దాడి ఈ ఒక్క మాటతో నాకు ఇవ్వవలసిన మొత్తం మూల్యం చెల్లించావు అన్నాను. అది ఒక మధురానుభవం!
ఇప్పుడు అన్నీ తెలిసిన వయసులో మన ఆశలని ఆశయాలని నేలకూల్చి మనల్నే సర్దుకుపొమ్మంటూ దానికి మూల్యంగా మన అనురాగాన్నే నవ్వుతూ వారికి చెల్లించమనడం ఎంతవరకూ సమంజసం!
కూతురికి తను అమ్మ అయినప్పుడే తన తల్లి విలువ తెలుస్తుంది అది సహజం!
మరి తల్లికి తన గడిచిన కాలం తిరిగిరాదు.....ఎవరు చెల్లిస్తారు దీనికి మూల్యం?

6 comments:

  1. చెల్లించగలిగే అవకాశం ఎక్కడో కొంతమంది మాత్రమే అందుకోగలుగుతారు .
    అందఱూ ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నారు . అందుకు కారణం " నా " , " నాది " అనే స్వార్ధం మాత్రమే .
    " మా " " మనది " అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా ఆ అమ్మ , నాన్నల మూల్యం చెల్లించగల్రు వారి ఆదరణతో కూడిన ఆలంబనతో .

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ శర్మగారు.....మీ వివరణ నాకు ఆత్మస్థైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చింది.

      Delete
  2. ఆడుతూ పాడుతూ వంటతోపాటుగా వడ్డిస్తారు మంచి సూక్తుల్ని మసాలా అద్ది. మంచి అమ్మ మీరు.

    ReplyDelete
  3. భవ్యమ్మైన సందేహం...తీర్చేవారెవ్వరు?

    ReplyDelete