Tuesday, September 2, 2014

!!లే ద్రౌపదీ!!

లే ద్రౌపదీ...లేచి వస్త్రాన్ని కప్పుకో
గోవిందుడు ఈ గోళంపైకి రాలేడు
నీకు నీవే రక్షణకవచం అయిపో!

మగతనాన్ని మంచమేసిన శకున్ని
మస్తిష్కంతో పాచికేసిన ప్రియుడ్ని...
ఎంతకాలం ఇలా గుడ్డిగా నమ్ముతావు
గోముఖవ్యాఘ్రహాలని గోవిందుడనేవు!

రక్షించమని అరిచి చర్చల్లోనే తడిచి
దుశ్శాసనుల దర్బారులో నిలబడి...
వార్తల్లోకి ఎక్కి వ్యభిచారిగా మారతావు
సిగ్గులేని సమాజాన్ని క్షమని వదిలావు!

లే ద్రౌపదీ వస్త్రాన్ని నడుముకి చుట్టుకో
గుడ్డిరాజ్యంలో గోచీలే, గోవిందుడు లేడు...
మూగచెవిటి జనాన్ని సహాయమేల కోరేవు
నీకు నీవే ఆయుధమై నిన్నునీవే రక్షించుకో!

8 comments:

  1. నీకు నీవే ఆయుధమై నిన్నునీవే రక్షించుకో!

    ReplyDelete
  2. రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసే ఇన్స్పిరేషన్ :-)

    ReplyDelete
  3. ప్రేరుకి తగ్గట్లుగానే ప్రేరణనిచ్చారు. చాలాబాగుందండి.

    ReplyDelete
  4. Fantastic and inspiring lines.. different style from you Madam.. abhinandanalato..

    ReplyDelete
  5. మంచి భావోధ్వేగ కవిత.

    ReplyDelete
  6. వాహ్ రే వాహ్....అదీ ధైర్యమంటే. అదరగొట్టేసారు

    ReplyDelete