చూడని తెలియని జీవిత వీధుల్లో...
మళ్ళీ విహరించాలన్న వాంఛ నాలో!
మరోమారు నా ఉనికిని చాటుకుంటూ
కాలప్రవాహంలో కొట్టుకుపోయిన ఆశల్ని
పరామర్శించి ఎవరి పంచన ఉన్నావంటూ
గట్టిగాహత్తుకుని మెత్తగామొట్టి మెల్లగాగిల్లి
బోరు బోరుమని ఏడవాలన్న ఉవాంఛ నాలో!
గతం అంతా గల్లంతై విహంగిలా గగన వీధుల్లో...
పసిపాపై గెంతి కిలకిలా నవ్వాలన్న కాంక్ష నాలో!
ఓసారి అన్నీమరచి నన్నునేను ప్రేమించుకుంటూ
స్వార్ధంతో నేను నాటిన చెట్టు పండ్లని నేనే తినాలని
నియమ నిష్టల నీతులు చెప్పిన వారిని తిట్టుకుంటూ
బంధం త్రుంచి భాధ్యతలని తెంచి నాలో ధైర్యాన్ని పెంచి
అడుగు వెనుక అడుగేసి కలిసిపోవాలన్న ఆకాంక్ష నాలో!
మీరు అనుకున్నది చేసెయ్యండి మేడం :-)
ReplyDeleteజిందగీ నా మిలేగీ దుభారా....గో ఎహెడ్....మీరు అనుకున్న విజయం సాధిస్తారు..
ReplyDeleteఆలస్యం ఎందుకు సాగిపొండి ముందుకు
ReplyDeletewe can't go back go back madam. we have to adjust with memories
ReplyDeleteచేయాలనుకున్నవన్నీ చేసేస్తే ఇంక ఏం మిగిలుండదుగా.
ReplyDelete