Wednesday, October 8, 2014

!!అన్వేషిస్తే!!

అలసిన జీవితానికి వయసుని ఆసరా అడిగా
గమ్యం ఏదంటూ ఎవరిని అడగాలో తెలియక
సాధించావలసినవి ఉన్నా శరీరం సహకరించక!

జీవితసారాన్వేషణలో "మార్పు"కి అర్థం అడిగా
అవసరానికి నీవారిగా దరిచేరి వీడిపోయేవారని
అనుభవశాలి విచిత్రంగా చెబుతూ చిత్రంగా నవ్వె!

సంతంతా తిరిగి సహనంతో సొమ్మసిల్లి అడిగా
మానవత్వం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని
సంతలో కానరాదు స్మశానంలో చూడమన్నారు!

మృత్యువునే మోహించాలని దానిరూపం అడిగా
చూడనైతే లేదు, కాని కడుసుందరమైన వినికిడి
ఒక్కసారి కలిసి జీవించడం వదిలేస్తారని తెలిసె!

3 comments:

  1. నిజమే మానవత్వం మంటగలిసింది.
    అనుభపూర్వపు కవిత. బాగుందండీ

    ReplyDelete
  2. అద్భుతంగా వ్రాశారు.

    ReplyDelete
  3. జీవితాన్ని కాసి వడకట్టి సారం తీసి గుండెని పిండుతాయి అక్షరాలు.

    ReplyDelete