Monday, August 29, 2016

!!చేసి చూపు!!

కంటితో చూసి బొమ్మల్ని ఆనందించగలం

చిత్రాల్ని చేతితో దిద్ది చిత్రకారులం కాలేము

ఎదుటివారి ఉన్నతిని చూసి ఈర్ష్య పడతాం

`లేదా మెచ్చుకుని సంబరపడగలమే కానీ...

కేవలం కబుర్లు చెబితే ఆ స్థాయిని చేరుకోము

నీడే తోడు ఉందని లోకాన్ని వీడి బ్రతుకలేం

ప్రయత్నించకనే ఫలితం దక్కలేదంటూ...

వాపోయి విధి వక్రమంటూ నిందించలేము

ధీక్ష కృషి పట్టుదల వంటి పెట్టుబడులు లేక

చేసే ఏ పనిలోనైనా విజయం సాధించలేం!

3 comments:

  1. మీ ఆలోచనలు అమోఘం

    ReplyDelete
  2. ప్రేరణతో ముందుకి నడిపించే పదాలు.

    ReplyDelete
  3. బాగున్నారు
    బాగా చెప్పారు.

    ReplyDelete