Sunday, September 11, 2016

!!బంధం!!

పత్ని మనసులో వెతికి చూడు
నీ ఊహల్లోని ప్రియురాలు కనిపించు
కూతురితో కులాసా కబుర్లు చెప్పు
గతించిన యవ్వనం జ్ఞాపకం వచ్చును
నీ మొదటి స్నేహాన్ని గుర్తు చేసుకో
అమ్మ ముఖం నీ ముందు కదలాడేను
వృధ్ధుడైన నాన్నతో మాట్లాడి చూడు
సలహాలిచ్చే ఆప్తమిత్రుడే అగుపించు
మిత్రుల్లో బంధాలు ఏం వెతుకుతావు
ఉన్న బంధాల్లో స్నేహితుల్ని వెతుకు
జీవితమే స్నేహమయం అనిపించు!!

4 comments:

  1. స్నేహితులు ముందు వచ్చి తరువాత పెళ్ళాం పిల్లలు వచ్చినట్లైతే ఎలా మాడంగారు? అలా అనుకుని సర్దుకుపొమ్మంటారా?

    ReplyDelete
  2. బాగాచెప్పరు మాడం.

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారు. ఇవ్వలాటి ఆధునిక జీవితంలో ఎదో ఒక మార్గంలో బంధాలని వెతుకుతున్నాం. మీ పోస్ట్ నిజంగా నే ఒక ప్రేరణ

    ReplyDelete
  4. అనుకుంటాము కాని కుదిరి చావదు.

    ReplyDelete