Sunday, September 18, 2016

!!నీవొక ప్రశ్న!!

నాకొక జవాబులేని ప్రశ్నవు నీవు...ఓ మనసా!
నా ఆలోచనలతో కలిసి అడుగు వేస్తావనుకుంటే 
నా అడుగులకు అడ్డొచ్చి అడ్డగిస్తావు ఎందుకనో
నిన్ను నమ్ముకుని నీదారి వెంట నే నడువబోవ
అటుఇటు కాని ఆశల్ని నాలో ఉసిగొల్పి నవ్వేవు
కాలం కలిసి వచ్చునులే వేచి ఉందామనుకుంటే 
కాలం మనతో కాదు కాలంతో మనమాడుకోవాలని
లేని పోని సూక్తుల్ని చెవిలోన ఊది జారుకుంటావు
అనుకున్నవి అన్నీ జరుగవులే అనుకుని దిటవుతో  
నిన్ను వీడి మెదడుతో మచ్చిక చేసుకుని కదలబోవ   
గతం జ్ఞప్తికని మెల్లగా మెదడునే చెదలా దొలిచేస్తూ..
మనసు మంచిదైతే చాలని నీతి చెప్పనేల ఓ మనసా?

2 comments:

  1. మనం మనసుచేత ఆడించబడుతున్న తోలుబొమ్మలం.

    ReplyDelete
  2. మనసు ఎప్పుడూ మన మాట వినదని తెలియదా మీకు.

    ReplyDelete