Sunday, November 6, 2016

!!నేను!!

ఎద నిండుగా కోరికలున్న నన్ను
కాలమా క్షణక్షణం ఏల పరీక్షిస్తావు?
నేను స్థిరంగా ఉండే సాగరాన్ని కాను..
ఓర్పుతో నదుల్ని నాలో కలుపుకోడానికి
సహనంతో సాధించనిది సంగ్రహించడానికి!  
వ్యధల్ని వధించే ధీరురాల్ని అసలే కాను..
గెలుపోటమిలా వచ్చిపోతాయని నవ్వడానికి
అన్నీ అశాశ్వితమని వేదాలు వల్లించడానికి!
రాయినో రప్పనో అంతకన్నా కాను..   
భావోధ్వేగాలు నన్ను తాకవని సర్దుకోడానికి
కభోధినై కన్నకలల్ని కట్టిపడేసి జీవించడానికి!

2 comments:

  1. తిరుగులేదు మీ కవితకు.
    జీవితాన్ని వడపోసిన వాక్యాలు.

    ReplyDelete
  2. భావోధ్వేగాలు నన్ను తాకవని సర్దుకోవడానికి గుడ్డిదాన్ని కాదంటూ రాసిన వాక్యాలు హైలైట్

    ReplyDelete