Sunday, November 13, 2016

!!ప్రయత్నించు!!

లేడిలా లేచి పరిగెత్త లేనని
ఆలోచించి ఆవేదన చెందకు
చేతకావడంలేదన్న చింతతో  
నీ ఆశయాలకు కళ్ళెం వేయకు
తాత్కాలిక ఒడిదుడుకులకు లొంగి
శాశ్వత సంతోషాల్ని తృంచివేయకు
జీవితంలో పడిలేచి పరుగిడక తప్పదు   
అయిన గాయాలు మానితే గెంతులేస్తావు
ప్రయత్నించకుండా ఫలితాన్ని పొందలేవు
ధృఢనిశ్చయంతో దేన్నైనా సాధిస్తావు!

1 comment:

  1. త్వరగా కోలుకుని చెంగు చెంగున గెంతులు వేస్తావమ్మా.

    ReplyDelete