Friday, May 5, 2017

!!తెలిసేది ఎలా!!

ఎలా తెలుసుకోను మదిలోని కోరికను
అవిటి ఆశ అవశేషాలే ఊతకర్రగా మారి 
కనబడే ముళ్ళమార్గాన్నే దాటేయమంటే
శాంతి సౌఖ్యమే ముందుంది పదమంటే!

ఒంటరైన ప్రయాస మొండికేసి కదలనని
దూరంగా మసగబారిన గమ్యాన్ని కసిరి  
కంపించే మరణాన్నే కౌగిలించుకోమనంటే
బండబారిన మనసుని ఎలా మభ్యపెట్టను!

గుండెకు చేరువగా మందిరం కనబడినా
ముక్తి ఉండలేనని వెళ్ళె బంధనాల దారి
తపనపడే తనువు వ్యధని తగ్గించలేనంటే
చింతలకి చికిత్స లేదని ఎలా తెలుపను!

కోమల కలుషిత హృదయాన్ని ఏమనను 
స్వార్థం ఎక్కుపెట్టి చూసె వయసునే గురి
చివరికి బాధలే బరిలోకి దిగి యుద్ధమంటే
గెలుపెవరిదనను జీవితమే అంతమౌతుంటే! 

5 comments:

  1. మీ అక్షరాలకు నమస్సుమాంజలి

    ReplyDelete
  2. భావప్రవాహం మనసు దోచింది మేడంగారు.

    ReplyDelete
  3. మదిని తడుముతాయి మీ అక్షరాలు.

    ReplyDelete