Tuesday, May 16, 2017

!!ప్రాకులాట!!

చెప్పేవారు కొందరు మౌనంగా మరికొందరు
నీడగా కొందరు నిట్టూర్పులతో ఇంకొందరు
ఎవరుండి చేసేది ఏముంది ఒరిగేదేముంది!

కొందరు తామేడుస్తూ ఇతరులని నవ్విస్తారు 
మరికొందరు నవ్వులు రువ్వుతూ ఏడుస్తారు
ఇలా నవ్వినా ఏడ్చినా కాలం ఆగనంటుంది!

కలలో వచ్చి జోలపాట పాడేవారు మనవారు
గాఢనిద్రలోంచి మేల్కొల్పుతారు పరాయివారు 
దరిచేర్చుకుని పొమ్మన్నా తేడా తెలియకుంది!

కొందరు మనసులో దూరి మనకి దగ్గరౌతారు
మరికొందరు వాస్తవాలకి వికృతిచేష్టలు అద్దేరు
అర్థమై అర్థంకాని వారు ఉండి లాభమేముంది!

ఇలా కొందరు అలా కొందరు ఎందుకో తెలీదు
ఆలోచించి ఆవేశపడి కూడా చేసేది ఏమీలేదు 
అందుకే పట్టింపు ప్రాకులాటలతో దిగులొద్దనేది!

3 comments:

  1. ఏ ప్రాకులాట వద్దని అందంగా వ్రాశారు.

    ReplyDelete
  2. జీవితాన్ని కాచినట్లుంది మీ కవిత

    ReplyDelete
  3. జీవితానుభవాలు చక్కగా రాసారు.

    ReplyDelete