విహంగాన్నై స్వేచ్ఛగా విహరించాలని
గ్రహాల మధ్య విలాసంగా పయనించాలని
కోట్ల క్రోసుల దూరదృశ్యాలను వీక్షించాలని
హిమాలయాల్లో ఐహిక వాంఛలు వీడాలని
భూగర్భంలో చొరబడి చిందులేయాలని
స్వల్ప రేణువుగా మారి ఎగిరిపోవాలని
సాగరంలో చేపలా కదలాడాలని
మండుటాగ్నిలో కాలక సేదతీరాలని
కోరుకోవడం ఒక ఎత్తు అయితే....
మనిషై పుట్టినందుకు మనిషిగా బ్రతకడం
మరో ఎత్తు...అవునంటారా కాదంటారా!?
నిలకడగా ప్రణాలిక ప్రకారం నడవడిక ఉంటే కష్టమేం కాదు.
ReplyDelete