Friday, June 9, 2017

!!లోకం తీరు!!

నాలా ఉండలేక నా వెనుక
గుసగుసలాడేరు కుచితస్వభావులు..
నాకు దక్కినవి వారికి దక్కవని 
ఈర్ష్యచెందేరు అసూయపరులు..
నాతో పోల్చుకుని ప్రయత్నించకనే
లోలోన కుళ్ళేరు అసమర్ధులు..
దేన్నైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు
లోకం అర్థమైన జ్ఞానులు!

4 comments:

  1. అమోఘం మీ భావాలు మాడం

    ReplyDelete
  2. ఎటువంటి వారినైనా క్షమించే వారే అసలైన జ్ఞానం కలవారు.
    మీరు ఆ కోవకే చెందాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. మీరు జ్ఞానులు మాడంగారు.

    ReplyDelete